టీటీవీ దినకరన్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం, ఇక ఆర్ కే నగర్ లో ఏం చేస్తాడో !

Posted By:
Subscribe to Oneindia Telugu
  100 మంది మీద వేటు వేసిన ఓపీఎస్

  చెన్నై: అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసి ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాదించిన టీటీవీ దినకరన్ ముక్కోటి ఏకాదశి రోజున ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి సర్వం సిద్దం చేసుకున్నారు.

  ముక్కోటి ఏకాదశి మంచి రోజు కావడంతో అదే శుభముహూర్తంలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చెయ్యాలని పండితులు ఇప్పటికే టీటీవీ దినకరన్ కు సూచించారు. శుక్రవారం తమిళనాడు స్పీకర్ ధనపాల్ టీటీవీ దినకరన్ తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

   TTV Dinakaran going to take oath as RK Nagar MLA by Speaker Dhanapal.

  గురువారం బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ ఆశీర్వాదం తీసుకున్న టీటీవీ దినకరన్ చెన్నై చేరుకున్నారు. శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తాను ఆర్ కే నగర్ లో పర్యటిస్తానని టీటీవీ దినకరన్ అంటున్నారు.

  ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత టీటీవీ దినకరన్ ఆర్ కే నగర్ లో పర్యటించడానికి ఆయన మద్దతుదారులు ఇప్పటి వరకూ ఏర్పాట్లు చెయ్యలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత టీటీవీ దినకరన్ ఓ స్వామీజీ ఆశీర్వాదం తీసుకోవడానికి వెలుతారని సమాచారం. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత టీటీవీ దినకరన్ ఆర్ కే నగర్ లో ఏం చేస్తారో ? అని చర్చ ఇప్పటికే మొదలైయ్యింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  As TTV Dinakaran got massive victory in RK Nagar, today he is going to take oath as RK Nagar MLA by Speaker Dhanapal.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి