రెండాకుల చిహ్నం లేకుంటే ఆర్ కే నగర్ లో దినకరన్ నో: పోటీలో ఈమె !
ఎన్నికల కమిషన్ శశికళ వర్గానికి రెండాకుల చిహ్నం కేటాయించకపోతే దినకరన్ ను ఉప ఎన్నికలకు దూరం పెట్టి ఎంజీఆర్ సోదరుడి కుమార్తె సుధా విజయ్ కుమార్ ను రంగంలోకి దించాలని శశికళ వర్గం నిర్ణయం తీసుకున్నారని సమాచా
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ పోటీ చెయ్యడం డౌట్ గానే ఉందని శశికళ వర్గంలోని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
శశికళ వర్గానికి రెండాకుల చిహ్నం దక్కకుంటే దినకరన్ ను పోటీ నుంచి తప్పించాలని శశికళ నిర్ణయించారని మంగళవారం విశ్వసనీయంగా తెలిసిందే. దినకరన్ పోటీ చెయ్యకుంటే ఆర్ కే నగర్ నుంచి పోటీ చెయ్యడానికి ఇప్పటికే ఓ అభ్యర్థిని ఖరారు చేశారు.

ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) సోదరుడి కుమార్తె సుధా విజయ్ కుమార్ ను ఆర్ కే నగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలని చిన్నమ్మ శశికళ నిర్ణయం తీసుకున్నారని ఆమె వర్గంలోని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు.

ఎన్నికల కమిషన్ శశికళ వర్గానికి రెండాకుల చిహ్నం కేటాయించకపోతే దినకరన్ ను ఉప ఎన్నికలకు దూరంగా పెట్టాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారు. ఎంజీఆర్, జయలలిత అభిమానుల ఓట్లను దీపా జయకుమార్ చీల్చకుండా సుధా విజయ్ కుమార్ ను రంగంలోకి దించాలని మంగళవారం శశికళ వర్గం నిర్ణయం తీసుకున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications