హైకోర్టును ఆశ్రయించిన అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు: దొడ్డిదారిలో సీఎం బలపరీక్ష !
అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వెయ్యడంతో టీటీవీ దినకరన్ అయోమయానికి గురైనాడు. ఊహించని ఎదురుదెబ్బ తగలడంతో దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వెయ్యడంతో టీటీవీ దినకరన్ అయోమయానికి గురైనాడు. ఊహించని ఎదురుదెబ్బ తగలడంతో దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించి తమ మీద అనర్హత వేటు వేశారని దినకరన్ గ్రూప్ లోని అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యే పి. వెట్రివేల్ అన్నారు. సోమవారం వెట్రివేల్ మీడియాతో మాట్లాడుతూ ఎడప్పాడి పళనిసామి మా మీద అనర్హత వేటు వేయించి దొడ్డిదారిలో అసెంబ్లీలో బలపరీక్షనిర్వహించడానికి సిద్దం అయ్యారని ఆరోపించారు.

తమ వర్గంలోని ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయించి బలపరీక్షలో నెగ్గాలని సీఎం ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్లాన్ వేశారని రెబల్ ఎమ్మెల్యే వెట్రివేల్ ఆరోపించారు. ఇలాంటి సిగ్గుమాలిన పని చెయ్యడం కంటే పళనిసామి, పన్నీర్ సెల్వం తమ పదవులకు రాజీనామా చేసి బలపరీక్షలో నెగ్గాలని సవాలు చేశారు.
చట్టపరంగా ఇబ్బందులకు గురి చేసి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం తమ పదవులు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నాడీఎంకే (శశికళ వర్గం) కర్ణాటక శాఖ ప్రధాన కార్యదర్శి పూహళేంది ఆరోపించారు. న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని, అప్పుడు ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతామని దినకరన్ వర్గం నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications