సీఎం మీద పగ: గవర్నర్ విద్యాసాగర్ రావ్ కరుణించారు, టీటీవీ దినకరన్ కు ఒక్క చాన్స్ !
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరించిన టీటీవీ దినకరన్ మీద ఆ రాష్ట్ర గవర్నర్ (ఇన్ చార్జ్) సీహెచ్. విద్యాసాగర్ రావ్ కరుణించారు. గవర్నర్ విద్యాసాగర్ రావ్ తో భేటీ కావాలని ప్రయత్నిస్తున్న టీటీవీ దినకరన్ కు గవర్నర్ ఒక చాన్స్ ఇచ్చారు.
సీఎం పళనిసామిపై తిరుగుబాటు: నోటీసులకు సమాధానం ఇస్తాం: టీటీవీ గ్రూప్ ఎమ్మెల్యేలు !
గురువారం రాజ్ భవన్ కు రావాలని గవర్నర్ విద్యాసాగర్ రావ్ అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించిన టీటీవీ దినకరన్ కు కబురుపంపారు. టీటీవీ దినకరన్ వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఇటీవల లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే.

అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు గవర్నర్ విద్యాసాగర్ రావ్ కు లేఖ ఇచ్చిన తరువాత తమిళనాడులోని ప్రతిపక్ష నాయకులు సైతం రాజ్ భవన్ లో ఆయన్ను కలిశారు. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి శాసన సభలో బలపరీక్ష నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని మనవి చేశారు.
మోడీ, పళనిసామికి వ్యతిరేంగా టీటీవీ దినకరన్ ఆందోళన, కొని కష్టాలు తెచ్చుకుంటున్నాడా ?
పళనిసామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఎమ్మెల్యేలు ఇంకా అన్నాడీఎంకే పార్టీలోనే ఉన్నారని, వారు వేరే పార్టీలో చేరలేదని, రాజీనామా చెయ్యలేదని చెప్పిన గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ ప్రతిపక్ష నాయకులు చేసిన విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించారు. అప్పటి నుంచి గవర్నర్ ను కలవడానికి ప్రయత్నిస్తున్న టీటీవీ దినకరన్ కు సీహెచ్. విద్యాసాగర్ రావ్ ఓ అవకాశం ఇచ్చారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications