వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దినకరన్ డెడ్ లైన్: శశికళ జోస్యం, పెత్తనం చెయ్యడానికి డేట్ ఫిక్స్, అంత సీన్ లేదు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప ప్రధాని కార్యదర్శిగా పగ్గాలు చేపట్టడానికి టీటీవీ దినకరన్ రెడీ అయ్యాడు. అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద పెత్తనం చెయ్యాలని టీటీవీ దినకరన్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.

ఢిల్లీలో ప్రధాని మోడీ, వెంకయ్యనాయుడితో తమిళనాడు సీఎం భేటీ, ఏంటి విషయం!ఢిల్లీలో ప్రధాని మోడీ, వెంకయ్యనాయుడితో తమిళనాడు సీఎం భేటీ, ఏంటి విషయం!

అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ నటరాజన్, టీటీవీ దినకరన్ ను బహిష్కరించామని జూన్ నెలలో తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి జయకుమార్ మీడియాకు చెప్పారు. ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎరవేశారని ఆరోపిస్తూ టీటీవీ దినకరన్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు.

దూరం పెట్టిన సీఎం

దూరం పెట్టిన సీఎం

నెల రోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్న టీటీవీ దినకరన్ తరువాత జామీను మీద బయటకు వచ్చాడు. అయితే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఎడప్పాడి పళనిసామితో సహ మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీటీవీ దినకరన్ ను దూరం పెట్టారు.

Recommended Video

Sasikala Natrajan's security beefed up in Karnataka Central jail | Oneindia News
టీటీవీ డేట్ ఫిక్స్ చేశాడు

టీటీవీ డేట్ ఫిక్స్ చేశాడు

అన్నాడీఎంకే పగ్టాలు చేపట్టడానికి టీటీవీ దినకరన్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆగస్టు 6వ తేదిన టీటీవీ దినకరన్ పార్టీ పగ్టాలు చేపడుతారని ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు చెప్పారు. జూన్ 5వ తేదీ పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శశికళను తాను కలిశానని టీటీవీ దినకరన్ అంటున్నారు.

60 రోజులు డెడ్ లైన్

60 రోజులు డెడ్ లైన్

60 రోజుల్లో అన్నాడీఎంకేలోని ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలిసిపోతాయని, తరువాత నువ్వు పార్టీ పగ్గాలు చేపట్టాలని శశికళ సూచించారని టీటీవీ దినకరన్ చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు మాత్రం విలీన చర్చలకు ముందుకు రాలేదు.

షాక్ మీద షాక్ ఇస్తున్నాడు

షాక్ మీద షాక్ ఇస్తున్నాడు

ప్రస్తుతం ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గీయులు ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇలాంటి సందర్బంలో అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) పగ్గాలు చేపట్టడానికి టీటీవీ దినకరన్ డేట్ ఫిక్స్ చేసుకోని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు

ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు

శశికళ కుటుంబ సభ్యులను దగ్గరకు తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు డిపాజిట్లు కూడా రావని తమిళానాడు సీఎం ఎడప్పాడి పళనిసామి ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద ఎడప్పాడి పళనిసామి, తమిళనాడు మంత్రులు కొందరు టీటీవీ దినకరన్ నాయకత్వాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని అన్నాడీఎంకే (అమ్మ) వర్గాలు అంటున్నాయి.

English summary
Sources Said AIADMK Amma team TTV Dinakaran will take incarge AIADMK Party after August 6. Dinakaran said that his aunt, who he met in prison on June 5, has set a 60-day deadline to chart their course of action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X