తుగ్లకీ లాక్‌డౌన్, పళ్లాలు మోతలు, భజన పాటలు- కరోనాపై కేంద్రాన్ని ఆడుకున్న రాహుల్
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పెరుగుతోంది, తాజాగా 24 గంటల్లో 2.17 లక్షల కేసులు నమోదయ్యాయి. చాలా రాష్ట్రాల్లో గతేడాది పరిస్ధితులు ఎదురవుతున్నాయి. దీంతో కేంద్రం మరోసారి లాక్‌డౌన్ విధిస్తుందన్న చర్చ కూడా సాగుతోంది. మరోవైపు కేంద్రం తీరుతోనే ఈ పరిస్దితి వచ్చిందన్న విమర్శలూ లేకపోలేదు. ఇదే క్రమంలో కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ కూడా కేంద్రం కరోనాను ఎదుర్కొంటున్న తీరుపై నిశిత విమర్శలు చేశారు.
గతేడాది కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్రం అనుసరించిన తీరును గుర్తు చేస్తూ ట్విట్టర్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పలు సెటైర్లు వేశారు. ముఖ్యంగా కేంద్రం లాక్‌డౌన్‌ను మూడు విధాలుగా ఎదుర్కొందని, అందులో మొదటిది తుగ్లకీ లాక్‌డౌన్ అనీ, రెండవది పళ్లాలు మోగించడం, మూడవది భజన పాటలు పాటడమని రాహుల్ పేర్కొన్నారు. ఈ మూడు మార్గాల్లో కేంద్రం కరోనాను ఎదుర్కొందని రాహుల్ ఎద్దేవా చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుండటం, భారీ ఎత్తున వ్యాక్సిన్లు వేస్తున్నా కేసుల సంఖ్య తగ్గకపోవడం నేపథ్యంలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్రానికి ఓ స్పష్టమైన విధానం లేదని రాహుల్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే రోజూ కరోనాకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న రాహుల్.. విదేశీ వ్యాక్సిన్లకు అనుమతివ్వకపోవడాన్నీ తప్పుబట్టారు. ఆ తర్వాత కేంద్రం విదేశీ వ్యాక్సిన్లకు ద్వారాలు తెరిచింది.
केंद्र सरकार की कोविड रणनीति-
— Rahul Gandhi (@RahulGandhi) April 16, 2021
स्टेज 1- तुग़लक़ी लॉकडाउन लगाओ।
स्टेज 2- घंटी बजाओ।
स्टेज 3- प्रभु के गुण गाओ।












Click it and Unblock the Notifications