3సార్లు రేప్ చేసిన టీచర్, ముగ్గురితో రేప్ చేయించిన అత్త
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పదిహేనేళ్ల బాలిక పైన ఓ ప్రయివేటు ట్యూషన్స్ సంస్థ నిర్వాహకుడు అత్యాచారం చేశాడు. అతనిని జునాగఢ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బాధిత బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమె అతని పైన జునాగఢ్ బీ డివిజన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడి పేరు రమేష్.
బాధితురాలి చెప్పిన వివరాల మేరకు.. రమేష్ నగరంలోని జోషిపారా ప్రాంతంలో ట్యూషన్ పాయింట్ నడుపుతున్నాడు. ఇతను గత వారం రోజుల్లో బాలిక పైన మూడుసార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
క్లాసుకు సంబంధించిన ఓ విషయం చెబుతానని రమేష్ బాలికను ఆదర్శ్ నగర్‌లోని సుందర్ వన్ ప్రాంతానికి తీసుకు వచ్చాడని, అక్కడ ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు వివరించారు. పోలీసులు నిందితుడి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రాజస్థాన్‌లో మరోచోట ఇంకో దారుణం జరిగింది. బాలిక పైన ఆమె అత్త మూడు నెలల పాటు ముగ్గురు వ్యక్తులతో అత్యాచారం చేయించిన ఘటన వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి ఆమె అత్తతో పాటు ముగ్గురు వ్యక్తుల పైన ఐపీసీ, పోస్కో చట్టాల కింద మహిళా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
అత్త అందుదేవి బాధిత బాలికను తనకు తెలిసిన ముగ్గురు వ్యక్తుల వద్దకు తీసుకు వెళ్లేదని, ఇలా మూడు నెలల పాటు ఆమె పైన అత్యాచారం చేయించిందని మహిళా పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్ఓ అనితా రాణి తెలిపారు. నిందితులను రమేష్, నరసింహరాం, రత్నారాంలుగా గుర్తించారు. వారిని అరెస్టు చేయాల్సి ఉంది. మరో కేసులో ముప్పై ఏళ్ల మహిళ పైన అత్యాచారం జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదయింది.












Click it and Unblock the Notifications