ప్రేయసి గొడవ: బంధువుని కాల్చి చంపిన వ్యక్తి

గుర్గావ్‌లో ఉంటున్న ప్రదీప్ కుమార్, లలిత్ (27) ఇద్దరూ సమీప బంధువులు. వారిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. అయితే తాను ప్రేమించిన యువతిని ప్రదీప్ ఇష్టపడుతున్నాడని లలిత్‌కు తెలిసింది. ఈ క్రమంలోనే వారు ఒక పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు.
విందు కార్యక్రమంలో వారిద్దరూ ఆ అమ్మాయి తనదంటే తనదని ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. ఆ సమయంలో తన బంధువు ప్రదీప్ కుమార్ పై లలిత్, అతని స్నేహితుడు హర్లూ దాడి చేశారు.
ఈ క్రమంలో ఆవేశం ఆపుకోలేకపోయిన లలిత్ తన వద్దనున్న నాటు తుపాకీతో ప్రదీప్ పై కాల్పులు జరిపాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో వీరిద్దరిపైనా అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications