వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఎలక్ట్రానిక్ వస్తువుల భారీ పెరిగే ఛాన్స్, కస్టమ్ డ్యూటీ పెంపే కారణమా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టీవీలు, మైక్రోవేవ్, ఎల్ఈడీ బల్బులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ధరల పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.కస్టమ్స్‌ డ్యూటీని పెంచడమే దీనికి కారణంగా నిపుణులు బావిస్తున్నారు.

ఎలక్ట్రానిక్ వస్దువులు కొనుగోలు చేయాలంటే జేబు ఖాళీ కావాల్సిందే. కంపెనీలు సులభ వాయిదాల ఆఫర్లిచ్చినా కానీ, ధరలు పెరిగిన వస్తువులను కొనుగోలు చేయాలంటే ఇబ్బందులు పడక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెరగనున్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు

పెరగనున్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు

రానున్న రోజుల్లో టీవీలు, మైక్రోవేవ్‌, ఎల్‌ఈడీ ల్యాంప్స్‌ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. స్థానిక తయారీకి ఊతమివ్వడానికి ఇటీవల ప్రభుత్వం కొన్ని ఎలక్ట్రానిక్‌ వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచింది.ఈ నేపథ్యంలో దిగుమతి సుంకాన్ని పెంచిన ఎలక్ట్రానిక్‌ వస్తువులన్నింటిపై ఇక కస్టమర్లు ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

టెలివిజన్ సెట్స్‌పై 20 శాతం కస్టమ్స్ డ్యూటీ

టెలివిజన్ సెట్స్‌పై 20 శాతం కస్టమ్స్ డ్యూటీ

ప్రభుత​ నోటిఫికేషన్‌ ప్రకారం టెలివిజన్‌ సెట్‌లపై కస్టమ్స్‌ డ్యూటీని 20 శాతానికి పెంచినట్టు తెలిసింది. అదేవిధంగా స్మార్ట్‌ఫోన్లపై ఈ డ్యూటీని 15 శాతానికి పెంచారు. ఎల్‌ఈడీ పంప్స్‌పై కూడా ప్రస్తుతం 20 శాతం దిగుమతి సుంకాన్ని విధించనున్నారు. మైక్రోవేవ్‌లపై కూడా ఈ డ్యూటీని రెండింతలు చేసి, 20 శాతంగా నిర్ణయించారు. దీంతో ఈ ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలన్నీ పెరిగిపోనున్నాయి.

ఎల్‌ఈడీ టీవీల రేట్ రూ.10 వేల వరకు పెరిగే ఛాన్స్

ఎల్‌ఈడీ టీవీల రేట్ రూ.10 వేల వరకు పెరిగే ఛాన్స్

స్క్రీన్‌ సైజు బట్టి సగటున ఎల్‌ఈడీ టీవీల ధరలు రూ.2000 నుంచి రూ.10వేల మేరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.. ఈ నిర్ణయం స్థానిక తయారీదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

 మేకిన్ ఇండియా తయారీదారులకు ప్రోత్సాహలు

మేకిన్ ఇండియా తయారీదారులకు ప్రోత్సాహలు

స్థానిక తయారీదారులను ప్రోత్సహించడమే కాకుండా.. మేకిన్‌ ఇండియా ఉత్పత్తులకు డిమాండ్‌ను ఏర్పరుస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.దిగుమతి సుంకాలను పెంచడం విదేశీ తయారీదారులు భారత్‌లో ఉత్పత్తులు తయారు చేసేలా ప్రోత్సహలు పెరిగే అవకాశం ఉందన్నారు.టెలివిజన్‌ సెట్లపైనే ధరలు ఎక్కువగా పెరుగనున్నట్టు అంచనావేస్తున్నారు. మైక్రోవేవ్‌లపై విధించిన 20 శాతం దిగుమతి సుంకంతో, మొత్తంగా మైక్రోవేవ్‌ కేటగిరీలో ధరలు సుమారు రూ.500 పెరిగే అవకాశం లేకపోలేదు.

English summary
According to the government notification, Customs duty on television set has been raised to 20 per cent while on imported smartphones, the duty has been hiked to 15 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X