వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగినులపై ఛానల్ సీఈవో లైంగిక వేధింపులు

యూట్యూబ్ ఛానల్ ది వైరల్ ఫీవర్(టీవీఎఫ్) వ్యవస్థాపకుడు, సీఈవో అరుణబ్ కుమార్ తనను లైంగికంగా వేధించినట్లు ఓ మాజీ ఉద్యోగిని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: ఓ ప్రఖ్యాత యూ ట్యూబ్ ఛానల్ కు సీఈవోగా ఉన్న ఓ ప్రబుద్ధుడు తమ సంస్థలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని గతంలో ఆ సంస్థలో పని చేసిన ఓ ఉద్యోగిని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో వెలుగులోకి వచ్చింది.

ఆన్ లైన్ డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ లో దేశంలోనే ఒకటిగా నిలుస్తున్న ది వైరల్ ఫీవర్(టీవీఎఫ్) వ్యవస్థాపకుడు, సీఈవో అరుణబ్ కుమార్ తనను లైంగికంగా వేధించినట్లు ఓ మాజీ ఉద్యోగిని ఆరోపించింది. ఈ విషయాన్ని ఆమె 'ది ఇండియన్ ఉబర్- దట్ ఈజ్ టీవీఎఫ్' పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

TVF Arunabh Kumar Molestation Controversy: Ex-woman employee accuses The Viral Fever chief of sexual harassment in blog ‘Indian Fowler’

సదరు సంస్థలో ఆమె రెండేళ్ల పాటు పనిచేసింది. ఆ సమయంలో వివిధ సందర్భాలలో అరుణబ్ కుమార్ తనపై ఏ రకంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో ఆమె వివరించింది. తొలిసారి ఓ ముంబై కేఫ్ లో అతడిని కలిశానని, ఇద్దరిదీ బీహార్ లోని ముజాఫర్ పూర్ కావడంతో అతడితో కాస్త సాన్నిహిత్యం ఏర్పడిందని పేర్కొంది.

ఆ పరిచయంతో.. తమ స్టార్టప్ లో చేరాల్సిందిగా తనకు అరుణబ్ సూచించాడని, అక్కడ చేరిన 21 రోజుల తరువాత నుంచే తనపై అతడు లైంగిక వేధింపులు ప్రారంభించాడని ఆమె పేర్కొంది. ఆ తరువాత రెండేళ్ల పాటు తాను ఆ చీకటి జీవితంలోనే బతికానని, పార్టీల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం వంటివి చేసేవాడని ఆరోపించింది.

కనీసం పోలీసుల సహాయం కోరడానికి కూడా లేకుండా, వారిని కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నట్లుగా అరుణబ్ కుమార్ తనను బెదిరించేవాడని తెలిపింది. ఈ మాజీ ఉద్యోగిని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమెతోపాటు మరో ఇద్దరు ఉద్యోగినులు కూడా అరుణబ్ కుమార్ పై ఈ రకమైన లైంగిక ఆరోపణలు చేశారు.

తమను కూడా అతడు ఇలాగే వేధిస్తున్నట్లు ఆ ఇద్దరు ఉద్యోగినులు పేర్కొన్నారు. తమ ఆరోపణలను ఈ స్టార్టప్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని కూడా వారు వ్యాఖ్యానించారు. అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలంటూ టీవీఎఫ్ కొట్టిపారేస్తోంది. టీవీఎఫ్ సేఫ్ వర్కింగ్ ప్లేస్ అంటూ గొప్పలు చెప్పుకుంటోంది. మహిళలనకు, పురుషులకు సౌకర్యవంతమైన జోన్ గా పేర్కొంటోంది.

English summary
Arunabh Kumar, the Founder and CEO of The Viral Fever (TVF), is in the eye of a storm after an anonymous blog by a former woman employee accused him of sexual harassment. YouTube channel TVF is one of India’s leading online digital entertainment channels and its chief Arunabh Kumar embroiled in a shocking molestation row has sent shock waves on social media. The female employee has recounted the horrifying molestation by Kumar in a lengthy blog titled ‘The Indian Uber – That is TVF‘, which went viral within hours of sharing. Not just her, two other women have shared their disgusting experience of alleged sexual harassment incidents at the hands of TVF chief Arunabh Kumar. Meanwhile, the startup has rejected the molestation charges made by the said former employee and other TVF members also claimed of having ‘No memory of this female employee’. Kumar has not responded to anything as of now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X