తలైవా దెబ్బకు దిగిరాక తప్పలేదు, కీలక మలుపు...!!

తమిళనాట ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీవీకే విజయ్ కేంద్రంగా కొత్త లెక్క లు తెర మీదకు వస్తున్నాయి. విజయ్ తో పొత్తు వరకు చివరి నిమిషం వరకు బీజేపీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అటు డీఎంకే కూటమి తమదే విజయం అనే ధీమాతో కనిపిస్తోంది. కాగా, తాజాగా టీవీకే నేత అదవ్ అర్జున తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ పై చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వేళ వివాదాస్పదంగా మారాయి. టీవీకే టార్గెట్ అయింది. రజనీకాంత్ తన స్టైల్ లో ఈ వ్యాఖ్యల పైన స్పందించారు. కాగా.. జరుగుతున్న నష్టం గ్రహించిన విజయ్ అండ్ టీం రజనీకాంత్ ముందు తగ్గక తప్పలేదు. ఇదే సమయంలో ఈ రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది.

తమిళనాడు ఎన్నికల వేళ విజయ్ పార్టీ లో నిర్ణయాలు రాజకీయంగా ఆసక్తి పెంచుతున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు కూటముల మధ్య విజయ్ కు దక్కే సీట్లు.. ఓట్లు ఫలితాన్ని శాసించటం ఖాయం గా కనిపిస్తోంది. ఈ సమయంలో టీవీకే వర్సస్ రజనీకాంత్ అన్నట్లుగా తాజా వివాదం చెలరేగింది. దీంతో.. సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ అదవ్ అర్జున తాజాగా క్షమాపణలు చెప్పారు. రజనీని బాధ పెట్టాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, ఆ వివాదం చాలా విచారం కలిగించిందని అన్నారు. 'నా నాయకుడు (విజయ్)కు నాయకుడైన రజనీకాంత్‌ను కించపరచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. అది డీఎంకే కుట్ర అని మాత్రమే చెప్పాను. రజనీ నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. నా వ్యాఖ్యలు ఆయనకు బాధ కలిగించాయని అర్థమవుతోంది. కానీ, అక్కడ నా ఉద్దేశం అది కాదు. ఈ వివాదం నాకు చాలా విచారం కలిగించింది' అని అదవ్ అర్జున చెప్పుకొచ్చారు.

tvk-leader-aadhav-arjuna-apologized-for-making-defamatory-remarks-about-rajinikanth

ఇటీవల అర్జున ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రజనీ రాజకీయ ప్రవేశం చేయాలనుకున్న సమయంలో డీఏంకే నేతలు ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. అలాంటి ఒత్తిళ్లకు విజయ్ తలొగ్గరని అన్నారు. డీఎంకే బెదిరింపులకు భయపడి రజనీ వెనకడుగు వేశారనే అర్థం వచ్చేలా, అర్జున చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. డీఎంకే నేతలు ఈ వ్యాఖ్య లను ఖండించారు. రజనీ కూడా అర్జున వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'టీవీకే ఉన్నతస్థాయి నేత ఒకరు నా మీద చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం. ఈ విషయంలో నేను చెప్పేది ఒకటే.. కాలం సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది' అని ఎక్స్ వేదికగా రజనీకాంత్ స్పందించారు. దీంతో రజనీ అభిమానులు టీవీకే పైన మండిపడ్డారు. తొలి సారి ఎన్నికల బరిలోకి దిగుతున్న టీవీకే కు ఈ వ్యాఖ్యలతో నష్టం తప్పదనే అంచనాలు మొదలయ్యాయి. ఈ సమయం లో విజయ్ సూచనల మేరకు అదవ్ అర్జున క్షమాపణలు చెప్పారు. వివాదానికి ముగింపు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+