కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను కలవనున్న విజయ్.. ఎప్పుడంటే ??

ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్.. కరూరులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యవహారం కేవలం తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు విజయ్ బాధితుల కుటుంబాలను కలవడానికి సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాగా ఈ నెల 17న కుటుంబాలను వారి ఇళ్ల వద్ద కాకుండా, ఒక ప్రత్యేక వేదికలో.. బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్లు సమాచారం. అయితే వేదిక వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విజయ్ బాధితులను కలిసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత కల్పించాలని టీవీకే పార్టీ విజ్ఞప్తి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని.. కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే మీడియాను అనుమతిస్తామని స్పష్టం చేశారు. తిరుచ్చి విమానాశ్రయం నుంచి కరూరులోని సమావేశ వేదిక వరకు విజయ్ ప్రయాణించే మార్గంలో జనం గుమికూడకుండా విమానాశ్రయ, ట్రాఫిక్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు పోలీసులు వివరించారు.

tvk-vijay-going-to-meet-karur-rally-tragedy-victims-families

అంతే కాకుండా కరూరులోని వేదిక నుంచి ఒక కిలోమీటరు దూరం వరకు ప్రజలెవరూ రాకుండా చర్యలు తీసుకోవాలని పార్టీ వర్గాలు కోరినట్లు సమాచారం. కేవలం బాధితుల కుటుంబ సభ్యులకు మాత్రమే వేదిక వద్దకు ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు చెందిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు (SOP) రూపొందించే వరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వరని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

మరోవైపు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని.. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని విజయ్ మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై మద్రాస్ హైకోర్టు సానుకూలంగా స్పందించకపోవడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్ తో దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు. సదరు పిటిషన్ ను మొదట వ్యతిరేకించిన న్యాయస్థానం.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది.

అలానే తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకుడు, పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు జీఎస్ మణి దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ రెండు పిటీషన్లు కూడా న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్ వీ అంజారియాతో కూడిన ధర్మాసనం ముందుకు రానున్నాయి. తమిళనాడుకే చెందిన బీజేపీ నాయకురాలు ఉమా ఆనందన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇందులోనే క్లబ్ చేయడానికి ఈ ధర్మాసనం అంగీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+