తమిళనాట విజయ్ ప్రభంజనం,పెనుమార్పు- భారీ ఓటింగ్ లెక్క పక్కా..!?

తమిళనాడులో కొత్త చరిత్ర. తొలి సారి రాజకీయ బరిలోకి దిగిన విజయ్ పై మరింత పెరిగిన అంచనాలు. తమిళనాడులో పోలింగ్ ముగిసింది. కొత్త అంచనాలు తెర మీదకు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన ఓటింగ్ తో ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఒక కీలక పార్టీ పునాదులు కదులుతున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. యువత.. మహిళలు పోలింగ్ కేంద్రాల వద్ద పోటెత్తారు. దీంతో.. ఓటింగ్ సరళి పైన పార్టీలకు ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఈ ఎన్నికలు తమిళనాడులో కొత్త చరిత్ర క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది.

తమిళనాడులో ప్రధాన పార్టీలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. 85 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ మార్పు ద్రవిడ రాజకీయాల ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. ప్రభుత్వం పైన వ్యతిరేకత.. లేక, కొత్త పార్టీ పైన ఆకర్షణ ఉంటేనే ఈ స్థాయిలో పోలింగ్ జరుగుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పోలింగ్ శాతం.. ఓటింగ్ సరళి.. ఓటర్ల నాడి పార్టీలకు స్పష్టత ఇచ్చింది. సర్వే రిపోర్టులు సిద్దం అయ్యాయి. 29వ తేదీ వరకు వీటిని బయట పెట్టే అవకాశం లేదు. కాగా.. తమిళనాడులో పోలింగ్ శాతం పెరిగే కొద్దీ... అంచనాలు తారు మారు అయ్యాయి.

TVK Vijay Sparks Massive Voter Surge in Tamil Nadu Record Turnout Buzz Grips Political Circles

ఎక్కడ చూసినా విజయ్ ఫ్యాక్టర్ పైనే చర్చ జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ యువత.. మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు. పోలింగ్ తరువాత వెల్లడవుతున్న అంచనాల మేరకు యువత ఏకపక్షంగా విజయ్ వైపు మొగ్గు చూపి ఉంటే, అది సంప్రదాయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల పునాదులను కదిలించడం ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి. తమిళనాడు చరిత్రలో మహిళా ఓటర్లు ఎప్పుడూ ఒక నిర్ణయాత్మక శక్తిగానే నిలిచారు. డీఎంకే, అన్నా డీఎంకేలను అధికారంలోకి తీసుకురావటంలోనూ.. ఓడించటం లోనూ వారే డిసైడింగ్ ఫ్యాక్టర్.

కాగా, ఇప్పుడు వీరు మార్పు కోరుకుంటున్నారా అనే విధంగా పోలింగ్ జరిగింది. విజయ్ కు భారీగా ఉన్న ఫ్యాన్ బేస్ పూర్తిగా ఈ ఎన్నికల్లో పని చేసినట్లు కనిపిస్తోంది. విజయ్ కు ఈ ఎన్నికల్లో 12 నుంచి 15 శాతం వరకు ఓటింగ్ జరిగే అవకాశం ఉందని సర్వే సంస్థలు అంచనా వేసాయి. కాగా.. పోలింగ్ తరువాత మాత్రం ఈ లెక్కలు మారాయి. 20 శాతం వరకు విజయ్ సాధిస్తే.. డీఎంకే కు కలిసి వచ్చి.. విజయ్ పార్టీ కీలక స్థానంలో నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ లెక్కన ఎన్డీఏ కూటమి భారీగా దెబ్బ తినే ఛాన్స్ ఉంది.

అంతకంటే విజయ్ కు ఎక్కువగా పోలింగ్ జరిగి ఉంటే మాత్రం.. ఖచ్చితంగా సీఎం ఎవరనేది డిసైడ్ చేసే అవకాశం విజయ్ చేతికి చిక్కుతుంది. పెరిగిన పోలింగ్ శాతం గురించి డీఎంకే ఇది తమ సంక్షేమ పథకాలకు లభించిన అనుకూల ఓటు అని ధీమా వ్యక్తం చేస్తోంది. కావేరీ డెల్టా , దక్షిణ జిల్లాల్లో ఓటర్ల ఉత్సాహం కొత్త చరిత్ర వైపే మొగ్గు చూపినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో.. ఈ అంచనాలు డీఎంకే, ఎన్డీఏ కూటమిని టెన్షన్ పెడుతు న్నాయి. కాగా.. అసలు ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది మే 4న వెల్లడి కానుంది. అప్పటి వరకు నిరీక్షించాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+