Twist: నదిలో శవాలైన ఒకే ఫ్యామిలీలో 7 మంది కేసులో ట్విస్ట్, ఆత్మహత్యలు కాదు, ప్రతీకారంతో, ఏం జరిగింది !
భీమా నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు బయటపడటంతో అందరూ కలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటారని ఇన్ని రోజులు పోలీసులు అనుకున్నారు. అయితే పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి.
పూణే/ముంబాయి: పూణేలోని భీమా నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతదేహాలు లభ్యమైన కేసు ఊహించని మలుపు తిరిగింది. ఒకే ఫ్యామిలీలో 7 మంది హత్య కేసులో మృతుల బంధువులు ఐదు మందిని పోలీసులు అరెస్టు చేశారు. భీమా నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు బయటపడటంతో అందరూ కలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటారని ఇన్ని రోజులు పోలీసులు అనుకున్నారు. అయితే పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. తన కొడుకు ప్రమాదంలో చనిపోవడానికి ఆ కుటుంబంలోని యువకుడు కారణం అని ఓ వ్యక్తి రగిలిపోవడంతో ఓకే ఫ్యామిలీలో 7 మంది హత్యకు గురైనారని పోలీసులు అన్నారు.

బంధువులే హంతకులు
పూణేలోని భీమానదిలె ఏడు మందిని హత్య చేసి నదిలో పడవేశారనే భయంకరమైన నిజం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.
మృతుల బంధువులే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. మోహన్ పవార్ (45), అతని భార్య సంగీతా (40), మోహన్, సంగీతా దంపతుల కుమార్తె రాణి ఫుల్వేర్ (24 ), అల్లుడు శ్యామ్ పుల్వేర్ (28)లతో పాటు ముగ్గురు పిల్లల మృతదేహాలు మహారాష్ట్రలోని భీమా నదిలో . జనవరి 24వ తేదీన బయటపడ్డాయి. పూణే జిల్లాలోని డుయాండ్ తహసీల్‌లోని పర్గావ్ వంతెన పరిధిలోని భీమానదిలో ఏడు మంది మృతదేహాలు లభ్యం కావడంతో అందరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని అందరూ అనుకున్నారు.

కిల్లర్స్ పక్కా స్కెచ్
ఈ కేసుకు సంబంధించి ఐదుగురు బంధువులను పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోహన్ పవార్ బంధువులైన అశోక్ కల్యాణ్ పవార్, శ్యామ్ కల్యాణ్ పవార్, శంకర్ కల్యాణ్ పవార్, ప్రకాశ్ కల్యాణ్ పవార్, కాంటాబాయి సర్జేరావు జాదవ్‌లను అరెస్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించి పూణే రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్ మీడియాకు వివరాలు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో మృతులందరూ హత్యకు గురైనట్లు సూచించే కొన్ని వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఆత్మహత్యలుగా నమోదైన కేసు మలుపు తిరిగిందని అన్నారు.

కొడుకు ప్రమాదంలో చనిపోయాడు
ఏడు మంది హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు అశోక్ పవార్ కుమారుడు ధనంజయ్ పవార్ కొన్ని నెలల క్రితం ప్రమాదంలో మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందిందని వివరించారు. ధనంజయ పవార్ ప్రమాదంలో చనిపోయాడని పూణే నగరంలో ఇప్పటికే కేసు నమోదు అయ్యిందని పూణే రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్ అన్నారు. తన కొడుకు మృతితో కోపోద్రిక్తుడైన అశోక్ తన కొడుకు ధనంజయ్ మృతికి మోహన్ కుమారుడే కారణమని భావించి ఆ కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవాలని భావించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

కొడకు కోసం ఏడు మందిని చంపేశారు
కొడుకు ధనంజయ్ పవార్ మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకు మోహన్ కుటుంబం మొత్తాన్ని హతమార్చేందుకు అశోక్ పథకం పన్నాడని పోలీసు సూపరింటెండెంట్ అంకిత్ గోయల్ తెలిపారు. మోహన్ ఫ్యామిలీలో ఏడు మందిని హత్య చేసిన తరువాత ఐదుమంది నిందితులు లోని అహ్మద్‌నగర్ జిల్లాలోని పార్నర్ తహసీల్ లో బంధువుల ఇంటిలో తలదాచుకున్నారని, అక్కడే ఐదు మంది నిందితులను అరెస్టు చేసి పూణేకి తీసుకు వచ్చామని పూణే రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్ మీడియాకు చెప్పారు.

ఎంతపని చేశారు
అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు. ఈ కేసు ఇంకా విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. భీమా నదీ గర్భంలో 200 నుంచి 300 మీటర్ల దూరంలో ఏడుగురి మృతదేహాలు ఇటీవల బయటపడ్డాయని గతంలో పోలీసులు చెప్పారు. నాలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా నీట మునిగి మృతి చెందినట్లు తేలింది. మృతులు మరఠ్వాడా ప్రాంతంలోని బీడ్, ఉస్మానాబాద్ జిల్లాలకు చెందిన వారని, వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే ఏడు మంది ఆత్మహత్య చేసుకున్నారని కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారణ చేస్తే అసలు మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications