Twist: ఏక్ నాథ్ షిండే ఏకంగా సీఎం ఎలా అయ్యారంటే ?, మోదీ, అమిత్ షా ప్లాన్, బీహార్ స్కెచ్, శివసేన బ్రాండ్ !
ముంబాయి/పాట్నా/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యేలతో సహ స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలతో కలిపి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ బాలాసాహెబ్ ఠాక్రే శివసేనకు చెందిన ఏక్ నాథ్ షిండేని ఎందుకు ముఖ్యమంత్రిని చేశారు ?. ఏక్ నాథ్ షిండేకి 50 మంది ఎమ్మెల్యే మద్దతు మాత్రమే ఉండటంతో ఆయన సీఎం ఎలా అయ్యారు ? తదితర విషయాలపై మహారాష్ట్రలో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పెద్దలు అన్నీ ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. బీహార్ ఫార్ములా ప్రయోగించి, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలను టార్గెట్ చేసుకోవాలని, శివసేన బ్రాండ్ సొంతం చేసుకోవాలని తదితర విషయాలు ఆలోచించి ఏక్ నాథ్ షిండేని ఏకంగా సీఎం చేశారని సమాచారం.

దేవేంద్ర ఫడ్నవిస్ కు అన్నీ అనుకూలంగా ఉన్నా ?
మహారాష్ట్ర సీఎం కావడానికి అన్ని అవకాశాలు ఉన్నా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను కేవలం ఉప ముఖ్యమంత్రిని చెయ్యడం వెనుక పెద్ద కథే ఉందని వెలుగు చూసింది. మహారాష్ట్రలో హిందుత్వ పార్టీ ఏదంటే టక్కున చెప్పేపేరు శివసేన, అలాంటి మహారాష్ట్రలో శివసేను దెబ్బ కొట్టాలని బీజేపీ హైకమాండ్ స్కెచ్ వేసింది తెలిసింది.

బీజేపీకి మోసం చేసి శివసేన
గత శాసన సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చినా మహారాష్ట్రలో అధికారం దక్కించుకోలేకపోయింది. ఉద్దవ్ ఠాక్రేని సీఎం చెయ్యాలనే ఏకైక ఉద్దేశంతో శివసేన నాయకులు కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపి బీజేపీకి ద్రోహం చేసింది. ఈ విషయం మనసులో పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అవకాశం కోసం ఎదురు చూశారు.

శివసేన బ్రాండ్ మీద దెబ్బ కొట్టిన బీజేపీ ?
శివసేన మీద ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చెయ్యడంతో ఆయన్నే ముఖ్యమంత్రి చేసిన బీజేపీ పెద్దలు శివసేనకు కోలుకోలేని దెబ్బ కొట్టారు. కు చెందిన ఎమ్మెల్యేని సీఎం చెయ్యాలని, శివసేనకు హిందత్వ బ్రాండ్ లేకుండా చెయ్యాలని, బీజేపీ బలమైన హిందుత్వ పార్టీ అని నిరూపించుకోవాలని బీజేపీ పెద్దలు ఈ స్కెచ్ వేశారని తెలిసింది.

బీహార్ లో నితీష్ కుమార్ ను ఎలా సీఎం చేశారంటే ?
ప్రధాని మోదీ బీహార్ ఫార్ములాను మహారాష్ట్రలో అమలు చేసి 2024 లోక్ సభ ఎన్నికలు టార్గెట్ చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం. బీహార్ లో జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అయితే బీహారి అయిన నితీష్ కుమార్ ను 2020లో ముక్యమంత్రిని చేసిన బీజేపీ అక్కడ మంచి మార్కులు కొట్టేసింది.
Recommended Video


మరాఠీల ఓట్లు చీలిపోతాయి
బీహార్ లో చేసిన ప్రయోగమే ఇప్పుడు మహారాష్ట్రలో అమలు చెయ్యాలని ఢిల్లీలోని బీజేపీ నాయకుల లెక్కలు వేశారని వెలుగు చూసింది. ఏక్ నాథ్ షిండే మరాఠీ. మహారాష్ట్రలో మరాఠీల ఓట్లు శివసేన, ఎన్సీపీ చీల్చుకున్నాయి. ఇప్పుడు మరాఠీ ఓట్లు చీల్చాలని అదే వర్గానికి చెందిన ఏక్ నాథ్ షిండేకి చాన్స్ ఇచ్చారని వెలుగు చూసింది. అన్ని లెక్కలు వేసుకున్న తరువాత బీజేపీ నాయులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఏక్ నాథ్ షిండే ఏకంగా సీఎం అయిపోయారని సమాచారం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications