నేను.. నా రాష్ట్రం.. మారిన అమరీందర్ సింగ్ ట్విట్టర్ బయో..

సోషల్ మీడియా బయో ఇప్పుడు ఏ నేత.. ఏ పార్టీ.. ఏ జెండాతో పనిచేస్తారో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ నేతలు పార్టీ మారే సమయంలో బయో ఛేంజ్ చేస్తుంటారు. దానిని బట్టి ఆ నేత ఎటు వైపు వెళతారో చెప్పవచ్చు. తాజాగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కూడా తన ట్విట్టర్ బయో ఛేంజ్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ లోగో ఉండేది. ఇప్పుడు మార్చేశారు. ఆర్మీ వెటరన్, మాజీ పంజాబ్ సీఎం, కంటిన్యింగ్ టు సర్వ్ ద స్టేట్ అని రాసుకున్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని స్పష్టంచేశారు.

అమరీందర్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ కలిగిస్తోంది. నిన్న అమిత్ షాతో భేటీ అయిన.. బీజేపీలో చేరడం లేదని స్పష్టంచేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగబోనని తేల్చిచెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. ఇకపై ఉండబోనని స్పష్టంచేశారు. అమరీందర్ సింగ్.. నిన్న సాయంత్రం హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలో గల అతని కార్యాలయంలో కలిశారు. తన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టంచేశారు. కానీ ఆయన అమిత్ షాతో భేటీ కావడం చర్చకు దారితీసింది. అమిత్ షా అధికార నివాసానికి చేరుకున్న.. కెప్టెన్ వివిధ అంశాలపై డిస్కష్ చేశారు.

Twitter bio changed, Captain Amarinder Singh keeps everyone in suspense over next move

మరోవైపు ఇంకా దారులు మూసుకుపోలేదని అమరీందర్ సింగ్ సన్నిహితులు అన్నారు. చర్చలకు అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. కానీ ఈ సమయంలో గాంధీ కుటుంబం.. అమరీందర్‌తో చర్చలు జరుపుతారా అనే అంశంపై స్పష్టత లేదు. సిద్దూ పీసీసీ చీఫ్ పదవీకి రాజీనామా చేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో అమరీందర్/ సిద్దూను చక్కదిద్దేందుకు హై కమాండ్ విశ్వప్రయత్నాలు చేసింది. కానీ మంగళవారం మంత్రివర్గం కొలువుదీరింది. రాణా మంత్రి పదవీ చేపట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. సిద్దుకు స్థిరత్వం లేదని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. కానీ పీసీసీ చీఫ్‌గా కొనసాగుతానని సిద్దూ ప్రకటన చేయడం కాస్త ఊరట కలిగించే అంశం. అమరీందర్ మాత్రం సస్పెన్స్‌ను కంటిన్యూ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+