వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్ నుంచి సీఈవో జాక్ డార్సీ ఔట్..? రాయిటర్స్ కథనం.. ఐ లవ్ అంటూ జాక్ ట్వీట్

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియా పుణ్యమా అని ఏం జరిగినా ప్రపంచానికి సెకనులో తెలిసిపోతుంది. ఇక ట్విట్టర్ గురించి అయితే చెప్పక్కర్లేదు. లక్షలాది మందికి సమాచారం చిటికెలో వెళుతుంది. చాలా మంది జనం విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు షేర్ చేసే అంశాలు అయితే ట్రెండ్ అవుతుంటాయి. ఓ స్టార్ తన ఇంటి పేరు తీసివేసినే సంచలనమే.. ఇటీవల సమంత.. ఆ తర్వాత ప్రియాంక చోప్రా గురించి వార్తలు ఎలా వచ్చాయో మనకు తెలిసిందే.

ట్విట్టర్‌కు ఆ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన వారిలో సీఈవో జాక్ డార్సీ ఒకరు. అయితే ఆయన సీఈవో పదవీ నుంచి వైదొలుగుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం రాసింది. దీనికి సంబంధించి ట్విట్టర్‌లో ఓ ప్రముఖ వ్యక్తి చెప్పినట్టు రాసుకొచ్చింది. జాక్ వారసుడిని కూడా ట్విట్టర్ బోర్డు ఎంపిక చేసిందని సమాచారం. అయితే అతని పేరును మాత్రం వెల్లడించలేదు. జాక్‌ను తప్పించాలని కంపెనీ బోర్డు చాలా రోజుల నుంచి భావిస్తోంది. ఏడాది నుంచి అతని వారసుడి గురించి అన్వేషిస్తోంది. ఈ మేరకు రాయిటర్స్ కథనం రాసింది.

Twitter CEO Jack Dorsey Expected To Step Down

జాక్ సీఈవోగా ట్విట్టర్‌ మంచి స్థానంలో ఉంచారు. ఇవాళ కంపెనీ వాటా 9 శాతం పెరిగింది. అయితే జాక్ కంపెనీ నుంచి వైదొలుగుతున్నారనే సమాచారంతో కంపెనీ షేర్లు 3 శాతం పడిపోయాయి. మరోవైపు ట్విట్టర్ అంటే తనకు ఇష్టం అని జాక్ ఇదివరకు ట్వీట్ చేశాడు. సోమవారం రోజు వరకు ఆ పోస్టుకు 54 వేల లైకులు వచ్చాయి.

జాక్ ట్విట్టర్ నుంచి వెళుతున్నారని తొలుత సీఆన్బీసీ రిపోర్ట్ చేసింది. 2020లో ఎలియట్ మేనెజ్‌మెంట్ కార్పొరేషన్ నడిపేవారు. అయితే ఆ సమయంలో ట్విట్టర్‌ అంటే అతనికి అంతగా ఆసక్తి ఉండేవాడు కాదు. ట్విట్టర్‌లో ఇలియట్, దాని అనుంబంధ సంస్థ సిల్వర్ లేక్‌కు షేర్ ఇప్పించారు. దీంతో అతనికి ప్రెషర్ తగ్గింది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ.. ట్విట్టర్ నుంచి వైదొలగనున్నాడు.

English summary
Twitter Inc CEO Jack Dorsey will step down from his role. a familiar person matter told to Reuters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X