Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Twitter Blue Tick: ప్రముఖులకు షాకిచ్చిన ట్విట్టర్.. బ్లూ టిక్ తొలగింపు..

ట్విట్టర్ పలువురు ప్రముఖులకు షాకిచ్చింది. కొందరి రాజకీయ ప్రముఖల ఖాతాల ట్విట్టర్ బ్లూ టిక్(Twitter Blue Tick) తొలగించింది. బ్లూ టిక్ కోల్పోయిన వారిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ట్విట్టర్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలంటే.. వెబ్ లో అయితే నెలకు రూ.650, మొబైల్ యాప్ లో అయితే రూ.900 చెల్లించాలి. భారతీయ జనతా పార్టీ (బిజెపి), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా వారి ధృవీకరణ బ్యాడ్జ్‌లను కోల్పోయాయి.

ట్విట్టర్ ను ఎలోన్ మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఇంతకుముందు బ్లూ టిక్ లు ఉన్నత స్థాయి వ్యక్తులు, పాత్రికేయులు, కార్యనిర్వాహకులు, రాజకీయ నాయకులు, సంస్థలకు వారి గుర్తింపులను ధృవీకరించిన తర్వాత ఇచ్చేవారు. ఇప్పుడు డబ్బులు పే చేస్తే బ్లూ టిక్ ఇచ్చేస్తున్నారు. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం Twitterవినియోగదారులలో దాదాపు 1 శాతం మంది మాత్రమే "Twitter బ్లూ"కి సభ్యత్వాన్ని పొందారు. గురువారం కూడా బ్లూ టిక్ కలిగి ఉన్న వినియోగదారుల కోసం పాప్అప్ సందేశం వచ్చింది. వారి ఫోన్ నంబర్‌ను ధృవీకరించాలని సూచించింది.

 twitter blue tick

బ్లూ టిక్ కోల్పోయిన వారిలో పోప్ ఫ్రాన్సిస్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు మైక్రోసాఫ్ట్ కార్ప్ కోఫౌండర్ బిల్ గేట్స్ ఉన్నారు.ట్విట్టర్ బ్లూ టిక్‌లను కోల్పోయిన వారిలో బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, అలియా భట్ కూడా ఉన్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ట్విట్టర్ ఖాతా ధృవీకరించింది. Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, Apple CEO టిమ్ కుక్ సబ్‌స్క్రిప్షన్ కోసం డబ్బు చెల్లించారు. దీంతో వారి బ్లూ టిక్ కొనసాగుతోంది.

సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కంపెనీలు, బ్రాండ్‌లు, వార్తా సంస్థలు మరియు ఇతర "ప్రజా ప్రయోజనాల" ఖాతాలు నిజమైనవని గుర్తించడానికి కంపెనీ 2009లో బ్లూ టిక్ మార్క్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ధృవీకరణ కోసం కంపెనీ ఇంతకు ముందు ఎలాంటి డబ్బులు వసూలు చేయలేదు. ఎలోన్ మస్క్ ట్విట్టర్ సొంతం చేసుకున్న తర్వాత బ్లూ టిక్, గోల్డ్ టిక్, గ్రే టిక్ తీసుకొట్టారు. ప్రభుత్వ సంబంధిత ఖాతాల కోసం గ్రే టిక్ వెరిఫికేషన్ కేటాయిస్తున్నారు. కంపెనీలకు గోల్డెన్ టిక్ మార్క్ ను ఇస్తున్నారు. మొదటగా టిక్ మార్కులను US, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, UKలలో సబ్‌స్క్రిప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా అంతట ప్రవేశపెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+