ముందువరుసలో కూర్చుని నిద్రలోకి జారుకున్న సీఎం!

Subscribe to Oneindia Telugu
  ముందు వరుసలో కూర్చుని నిద్రపోతున్న CM, watch

  బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వార్తల్లోకెక్కారు. మంగళవారం మడికేరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సమావేశం జరుగుతుండగానే నిద్రలోకి జారుకున్నారు.

  ముందు వరుసలో కూర్చుని ముఖ్యమంత్రి తూలుతూ నిద్రపోతున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఊరుకుంటారా? వారి నచ్చిన విధంగా జోకులు వేస్తూ అందరితో పంచుకుంటున్నారు.

  'గుడ్ మార్నింగ్ సిద్ధరామయ్య.. ప్లీజ్ తొందరగా లేవండి' అని ఒకరు, 'పని వేళల్లో నిద్రపోయే అవకాశం కేవలం జపాన్‌లో మాత్రమే ఉంది' మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరైతే మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బాటలో సిద్ధరామయ్య నడుస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంటులో రాహుల్ నిద్రిస్తున్న ఫొటోను సిద్ధరామయ్య ఫొటోకు జతచేసి ట్వీట్ చేశాడు.

  ఇప్పుడే కాదు, గతంలోనూ పలు కార్యక్రమాల్లో సిద్ధరామయ్య ఇలాగే నిద్రపోయి వార్తల్లో నిలిచారు. 2017 మేలో కాంగ్రెస్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ జరుగుతుండగా ఆయన ముందు వరుసలో కూర్చుని మరీ నిద్రపోవడం గమనార్హం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Siddaramaiah once again became the topic of jokes on Twitter after the Karnataka Chief Minister was seen dozing away with not a care in the world at a Congress event in Madikeri on Tuesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి