వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

26/11 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయ్యద్ ట్విట్టర్ ఎకౌంట్ నిలిపివేత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమాత్ ఉద్ దవా చీఫ్, 26/11 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రదారి హఫీజ్ సయ్యద్ ఖాతాను సోషల్ నెట్ వర్కింగ్ సర్వీసులందించే ట్విట్టర్ నిలిపివేసింది. కారణం ఈనెల 5న లాహోర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో హఫీజ్ సయ్యద్ భారత్‌కు వ్యతిరేకంగా ట్వీట్స్ చేయడమే.

తన ట్విట్టర్‌లో "కాశ్మీర్ తప్పకుండా విముక్తి పొందుతుంది. 1971 భారత్- పాక్ యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుంటాం. అహ్మదాబాద్, గుజరాత్ బాధితులు తప్పకుండా న్యాయం పొందుతారు" అని హఫీజ్ ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలోనే అతడి ట్విట్టర్ ఖాతాను తొలగించినట్టు ట్విట్టర్ పేర్కొంది. గత సెప్టెంబర్‌లో జమ్మూ కాశ్మీర్‌లో వచ్చిన వరదలకు భారతే కారణమని నిందించాడు. ముఖ్యంగా ఈ వరదల వల్ల పాకిస్ధాన్ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు పాకిస్ధాన్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా వరదల్లో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.

Twitter suspends 26-11 mastermind Hafiz Saeed's account

ఏప్రిల్ 2012న యునైటెడ్ స్టేట్స్ వాంటెడ్ తీవ్రవాదుల లిస్ట్‌లో హఫీజ్ సయ్యద్ పేరున చేర్చారు. అతనికి సంబంధించిన సమాచారం అందించిన వారికి 10 మిలియన్ డాలర్ల రివార్డుని కూడా ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.

English summary
Social networking service Twitter has suspended the account of Jamaat-ud-Dawah (JuD) chief Hafiz Saeed (HafizSaeedJUD), the prime accused in the 26/11 2008 Mumbai terror attack case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X