ఇవేం ట్వీట్లు?: కేజ్రీవాల్ ఖాతా తొలగించిన ట్విట్టర్!

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రికి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ షాకిచ్చింది. అనుచితమైన ట్వీట్లు చేస్తున్నారంటూ ఆయన ఖాతాను ట్విట్టర్ సంస్థ రద్దు చేసింది. కేజ్రీవాల్ అకౌంట్‌లో ఉన్న ట్వీట్స్‌ను సమీక్షించిన తర్వాత ఆయన అకౌంట్‌ను వ్యంగ్యానుకరణ(పేరడీ) ఖాతాగా భావించి ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది.

'కేజ్రీవాల్.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ విధానాలు, విద్యాపరమైన సంస్కరణలు, సంక్షేమ పథకాలు, మౌళిక సదుపాయాలు, ఆరోగ్యపరమైన కొత్త విషయాలు, మొదలగు అంశాలపై స్పందిస్తారని అనుకున్నాం. కానీ, అలాంటిది ఇప్పటి వరకు ఒక్కటి కూడా అతని ఖాతా నుంచి రాలేదు' అనేది ట్విట్టర్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

kejrival

అంతేగాక, కేజ్రీవాల్ పేరుతో ఓ పేరడీ అకౌంట్‌ను ఎవరో నడుపుతున్నట్టు తొలిసారి అనేక అనుమానాలను తమ సంస్థకు కలిగినట్లు ట్విట్టర్ ఉద్యోగి చెప్పారు. కేజ్రీవాల్ పోస్టు చేసిన చాలా ట్వీట్లను పరిశీలించినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీని దూషించడం, తను చూసిన సినిమాల గురించి ప్రశంసిస్తూ ట్వీట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి నుంచి ఇంతకన్నా ముఖ్యమైన అంశాలు ఆశించామని తెలిపారు.

అంతేగకా, 'కేవలం మోడీ, సినిమాలపైనే ట్వీట్ చేయడాన్ని బట్టి .. ఆయన బైనరీ వ్యవస్థను నమ్ముకొన్నట్టు కనిపిస్తోంది. పిరికిపంద, సైకోపత్(మానసిక రోగి) అంటూ ప్రజలపై విరుచుకుపడుతాడు. అనుచిత భాషను ఉపయోగించడం, సినిమాలపై ఆయనకు సరైన అవగాహన లేకపోవడం వల్ల కేజ్రీవాల్ ట్విట్టర్ అకౌంట్‌ను రద్దు చేస్తున్నాం' అని సంస్థ ప్రతినిధి వివరణ ఇచ్చారు.

అయితే తన ట్విట్టర్ అకౌంట్ రద్దు కావడానికి కారణం ప్రధాని మోడీనే అంటూ మరోసారి కేజ్రీవాల్ మండిపడ్డారు. 'సోషల్ మీడియాపై మేమంత ఆధారపడి ఉన్నామో సమాజానికి తెలుసు. సచివాలయాల నుంచి కాకుండా ట్విట్టర్‌ను ఆధారంగా చేసుకొని ప్రభుత్వాన్ని నడిపే తొలి రాజకీయ పార్టీ ఆప్ అన్నది అందరికీ తెలుసు' అని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఆప్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నాడు అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

కాగా, అసలు విషయం ఏమిటంటే ఈ కథనమంతా ఊహాజనితమే. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఓ వార్త కథనాన్ని ప్రచురితం చేసింది. నవ్వుకోవడానికి మాత్రమే ఇలాంటి కొన్ని కథనాలు ప్రచురితం చేస్తున్నట్లు పేర్కొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Micro-blogging website Twitter recently suspended AAP supremo Arvind Kejriwal's account after reviewing the tweets and concluding it to be a parody account.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి