షాక్: దొంగిలించారని తాళ్లతోకట్టి నగ్నంగా పరుగెత్తించారు

ఆ తర్వాత కొందరు ఆ ఇద్దరిని దుస్తులు విప్పించి తమ బైక్‌ల పైన తాడుతో కట్టి పరుగెత్తించారు. ఇది గత నెల 21న జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొబైల్స్ దొంగిలించిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికులపై కూడా మరో కేసు నమోదు చేశారు.
ఈ సంఘటన గోవా రాజధాని పనాజీకి దక్షిణాన 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఫోర్ట్ వద్ద జరిగింది. స్థానిక టీవీ ఛానళ్ల ఇది రావడంతో వెలుగులోకి వచ్చింది.
విజువల్‌లో కనిపిస్తున్న బాధితులు ఇద్దరు కూడా ఎక్కడి వారో తెలియదు. అయితే వారిని దాదాపు ఓ ముప్పై మంది స్థానికులు తాడుతో కట్టేసి రోడ్డు పైన పరుగెత్తించారు. ఇద్దరు దొంగల పైన అమానవీయంగా ప్రవర్తించిన స్థానికులలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications