టిసిఎస్ మహిళా టెక్కీ హత్య కేసులో ఇద్దరు అరెస్టు

ఈ కేసులో సరిగా స్పందించనందుకు, స్పికాట్ ఐటి పార్కు పరిసరాల్లో భద్రత కల్పించినందుకు పోలీసు ఇన్‌స్పెక్టర్ సుబ్బయ్యను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఉమామహేశ్వరి అనే ఆ టెక్కీ ఫిబ్రవరి 13వ తేదీన కనిపించకుండా పోయింది.
సేలం జిల్లాకు చెందిన ఉమా మహేశ్వరి సిరుసెరిలోని టిసిఎస్‌లో ఇటీవలే చేరింది. వారం రోజుల నుంచి తమ కుమార్తె కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే శనివారం ఆమె మృతదేహం పోలీసులకు చిక్కింది.
ఉమా మహేశ్వరి సంస్థకు చెందిన వాహనంలోనే కార్యాలయానికి వెళ్లేది. అదృశ్యమైన రోజు మాత్రం అందులో ఎక్కలేదు. ఆమె మొబైల్ ఫోన్ స్విచ్చాప్ చేసి ఉంది. దీంతో సమాచారం అందలేదు. ఆమె మృతదేహం కార్యాలయానికి రెండువందల మీటర్ల దూరంలో గుర్తించారు.
ఉద్యోగం చేస్తున్న ఆమె స్నేహితులతో కలిసి మేడవక్కం ప్రాంతంలో ఓ గదిని కిరాయికి తీసుకొని ఉంటున్నారు. ఆమె అదృశ్యమైన రోజు (ఫిబ్రవరి 13)న చివరిసారిగా రాత్రి పదిన్నర గంటలకు స్నేహితులకు కనిపించారు.












Click it and Unblock the Notifications