మహిళను రెండో పెళ్లి చేసుకున్న తల్లి... విచిత్ర ప్రవర్తన.. శివుడు,శక్తి అంటూ కన్నబిడ్డలనే నరబలికి...
తమిళనాడులో ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది. రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో వెలుగుచూసిన సంఘటనను గుర్తుకు తెచ్చేలా ఈ సంఘటన కనిపిస్తోంది. మదనపల్లెలో శివ పూజ పేరుతో ఉన్నత విద్యావంతులైన ఇద్దరు తల్లిదండ్రులు కన్నబిడ్డలనే బలితీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులోనూ ఓ తల్లి తన పిల్లలను శివుడు,శక్తి అని పిలుస్తూ వారిని నరబలి ఇచ్చేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఆమె బారి నుంచి తప్పించుకున్న పిల్లలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

అసలేం జరిగింది...
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా పుంజైపులియంపట్టిలో రామలింగం (42),రంజిత(36) అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి 15 ఏళ్లు,6ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం నుంచి రామలింగం-రంజిత దంపతుల్లో చాలా మార్పు వచ్చింది. రామలింగం ఇందుమతి(32) అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యలు,పిల్లలతో కలిసి స్థానిక రంగపాళయం రైల్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు.

మరో మహిళతో తల్లి రెండో పెళ్లి...
రామలింగం రెండో పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే రంజిత కూడా రెండో పెళ్లి చేసుకుంది. అయితే ఆమె పెళ్లి చేసుకున్నది ఓ మహిళను. తన భర్త రెండో భార్య ఇందుమతికి స్నేహితురాలైన శశి(38) అనే మహిళను రంజిత రెండో వివాహం చేసుకుంది. శశి కూడా అదే ఇంట్లో వారితో పాటే ఉంటోంది. రెండో పెళ్లి తర్వాత రంజితలో విపరీతమైన మార్పు వచ్చింది. శశిని నాన్న అని పిలవాలని,తండ్రి రామలింగంను మామ అని పిలవాలని తన ఇద్దరు కుమారులను వేధించడం మొదలుపెట్టింది.

శివుడు శక్తి అంటూ నరబలికి...
రంజిత తన ఇద్దరు పిల్లలను స్కూల్ కూడా మానేయించింది. తండ్రి చనిపోయాడని అబద్దం చెప్పి స్కూల్ నుంచి వారి టీసీలు తీసుకొచ్చింది. అప్పటినుంచి వారితో ఇంటి పనులన్నీ చేయిస్తోంది. ఏ చిన్న పొరపాటు చేసినా ఒళ్లంతా కారం పూసి చిత్రహింసలకు గురిచేస్తోంది. అంతేకాదు,కొన్నిసార్లు పురుగుల మందు తాగాలని ఒత్తిడి చేసింది. ఇటీవల తన ఇద్దరు కుమారులను రంజిత శివుడు,శక్తి అని పిలవడం మొదలుపెట్టింది. అంతేకాదు,ఆ ఇద్దరిని నరబలి ఇచ్చేందుకు సిద్దపడినట్లు తెలుస్తోంది. ఈ విషయం పసిగట్టిన ఇద్దరు కుమారులు ఇంట్లో నుంచి పారిపోయి తాత వద్దకు చేరుకున్నారు. తాత,నానమ్మలతో సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications