ఎంత నిర్లక్షం, ఆడుకోవడానికి వెళ్లిన అబ్బాయిలు ఏం అయ్యారంటే ?, వదిలేసి వెళ్లారు !

బెంగళూరు: బెంగళూరులోని సుద్దగుంటెపాళ్యలో నిర్మాణంలో ఉన్న భవనం బేస్‌మెంట్ నీటి సంప్ లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనాల్లో పిల్లలను ఆడుకునే ముందు జాగ్రత్తగా ఉంచండి అని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటి సంఘటన జరుగుతూనే ఉన్నాయి.

ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ నీటి సంపుల్లో పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, నిర్మాణంలో ఉన్న భవనాల్లోని నీటి సంపుల మీద మూతలు వేయాలని సంబంధిత అధికారులు చెబుతూనే ఉన్నారు. బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనంలోని బేస్‌మెంట్‌లో నిర్మించిన వాటర్‌ ట్యాంక్‌లో ఇద్దరు చిన్నారులు పడి చనిపోయారు.

Two boys drowned in Bengaluru after building fell into water tank

ఈ ఘటన జరిగిన తర్వాత దాదాపు కొన్ని గంటల పాటు పిల్లల కోసం వెతికారు.. పిల్లలు ఆడుకుంటున్న అన్ని చోట్లా వెతికినా ఎలాంటి ఫలిలం లేకపోయింది. చివరికి తల్లిదండ్రులు వారి పిల్లలు నిర్మాణంలో భవనం వైపు వెళ్లి ఉండొచ్చనే అనుమానంతో అక్కడికి వెళ్లి చూశారు. ఈ సమయంలో నిర్మాణంలో ఉన్న భవనంలోని బేస్‌మెంట్‌లోని నీటి సంపులో చిన్నారుల చెప్పులు తేలుతుండడంతో వారికి అనుమానం వచ్చింది.

చిన్నారులు నీటి సంపులో మునిగి చనిపోయి ఉంటారని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. భవనంలోని నీటి సంపులో నీరు నిల్వచెయ్యడానికి సంపుతీశారు. అయితే గత కొన్ని రోజులుగా భవన నిర్మాణం ఆగిపోవడంతో పిల్లలు ఆడుకునేందుకు అక్కడికి వెళ్లేవారు.

అదేవిధంగా ఆదివారం ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులు అర్షలాన్ ఖాన్ (9), అమీన్ ఖాన్ (7) అనే ఇద్దరు అబ్బాయిలు వాటర్ ట్యాంక్ లో పడి మృతి చెందారు. బన్నేరుఘట్ట రోడ్డు పక్కనే ఉన్న భవనంలో ఈ ఘటన జరగడంతో సుద్దగుంటపాళ్య పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+