వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ వర్షాలు: ముంబైలో కుప్పకూలిన రెండు భారీ భవనాలు, ఒకరు మృతి, శిథిల్లాల్లో..

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు ముంబైలోని రెండు భారీ భవంతులు గురువారం కుప్పకూలిపోయాయి. సౌత్ ముంబైలోని ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో కొంత మంది ఆ శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.

నాలుగు ఫైరింజిన్లు, ఓ రెస్క్యూ వ్యాన్, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. ఐదు అంతస్తుల భవనం కూలిపోయిందని, శిథిలాల్లో కొందరు చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

Heavy rains in Mumbai led to two building collapses in two different areas of the city today.

ఇక మరో ఘటనలో ముంబైలో శివారులోని మలాద్ మల్వానీ ప్రాంతంలోని ఓ మూడంతస్తుల భవనం కూడా కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు భవన శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

భవన శిథిలాల్లో ఐదారుగురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే శిథిలా నుంచి ఇద్దర్ని బయటికి తీసి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా బుధవారం ముంబైలోని గ్రాంట్ రోడ్‌లోని పవ్వాల స్ట్రీట్ వద్ద ఓ భవనం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు.

Recommended Video

Sushant Singh Rajput కేసు CBI Investigation పై స్పందించిన Amit Shah || Oneindia Telugu

మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై నగరంలో పలు ప్రాంతాలు వరదనీటిమయమయ్యాయి. పాత భవనాలు కూలిపోతున్నాయి. కాగా, మరో 18 గంటలపాటు ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఓ వైపు కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో ఈ వర్షాలతో మరింత ప్రభావం పెరిగే అవకాశం ఉండటంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

English summary
Heavy rains in Mumbai led to two building collapses in two different areas of the city today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X