రథోత్సవంలో విద్యుద్ఘాతం - 11మంది సజీవదహనం : తంజావుర్​లో ఘోరం..!!

తమిళనాడులోని తంజావూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కలిమేడు అప్పర్ ఆలయ రథం విద్యుత్ తీగకు తగలడంతో 11 మంది సజీవదహనమయ్యారు. మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అప్పర్‌ గురుపూజై (అయ్యప్పస్వామి పండుగ) సందర్భంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు రథాన్ని వీధుల మీదుగా గుడికి తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు అది హైటెన్షన్‌ వైర్లకు తగిలింది.

షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సజీవ దహనం అయిన వారిలో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. రథోత్సవంలో పాల్గొనేందుకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆలయ రథం నుంచి 50 మంది వ్యక్తులు దూరంగా ఉండటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

Two children among 11 electrocution during a temple chariot procession in Thanjavur

ఈ ఘటనలో గాయపడిన మరికొంత మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రాంతమంతా నీటి కుంటలు ఉన్నందున ఈ సంఘటనలో ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంది. ఘటన తెలిసిన వెంటనే అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. పోలీసు - వైద్య అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+