తప్పిన పెను ప్రమాదం: మెట్రో పిల్లర్ గుంతలో లైవ్ బాంబులు

Subscribe to Oneindia Telugu

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో పెద్ద ప్రమాదం తప్పింది. మూడో దశ మెట్రో పనులు చేస్తుండగా కార్మికులకు ఓ మెట్రో పిల్లర్ గుంత తీస్తుండగా రెండు పాత లైవ్ బాంబు లభ్యమైంది. అయితే, అది వెలికితీసే సమయంలో పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

సమాచారం అందుకున్న బాంబు నిర్వీర్య బృందం హుటాహుటిన ఆ స్థలానికి చేరుకుని.. రెండు బాంబులను నిర్వీర్యం చేశారు. వాటిని ఫోరెన్సిక్ లాబోరేటరీలో పరీక్షించేందుకు తీసుకెళ్లారు. అయితే, ఘటనా స్థలంలో చిన్న పేలుడు సంభవించింది. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Two crude bombs found at Mumbai Metro site

ఓ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో మెట్రో పిల్లర్ గుంత తీస్తుండగా తమకు ఓ అనుమానాస్పద వస్తువు దొరికిందంటూ పోలీసులకు ఫోన్ వచ్చింది. రోడ్డు ఉపరితలానికి ఓ మీటర్ లోతు తవ్వకాలు జరిపిన తర్వాత ఆ వస్తువు బయటపడింది.

దీంతో పోలీసులు బాంబ్ స్క్వాడ్ కు ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి వచ్చిన బాంబ్ స్క్వాడ్ వాటిని నిర్వీర్యం చేశాయి. ఆ బాంబుల్లో స్ప్లింటర్లు, నెయిల్స్ వంటివి కూడా చాలా ఉన్నాయి. కాగా, ఈ బాంబులు లభించిన చోటుకు కూత వేటు దూరంలోనే ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉండటం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two crude bombs were unearthed during digging at a Metro construction site in Mumbai Central on Wednesday, which were later defused and sent for forensic testing.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి