Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్ : 'అమిత్ షా పీఏకి ఫోన్ చేస్తాం... మత విద్వేషాలు రెచ్చగొడుతాం..' రచ్చ రచ్చ..

తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ పొలిటికల్ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ తిను బండారాల షాపు యజమానిని బెదిరింపులకు గురిచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీఏకి ఫోన్ చేస్తామని... మత విద్వేషాలు రెచ్చగొడుతామని షాకింగ్ కామెంట్స్ చేశారు. తిన్న ఫుడ్‌కి బిల్లు కట్టాలని ఆ షాపు యజమాని అడిగినందుకు ఇలా నోటికొచ్చినట్లు వాగడమే కాదు... నానా రచ్చ చేశారు. గత సోమవారం(జనవరి 11) రాత్రి చెన్నైలోని ట్రిప్లికేన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

చెన్నై పోలీసుల కథనం ప్రకారం... సోమవారం రాత్రి ట్రిప్లికేన్‌లోని ఓ తిను బండారాల షాపుకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నారు.అయితే బిల్లు కట్టకుండానే ఇద్దరూ వెళ్లిపోతుండటంతో షాపు యజమాని ఇదేంటని ప్రశ్నించాడు. బిల్లు కట్టమని కోరాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన ఆ ఇద్దరూ యజమానిపై ఆవేశంతో ఊగిపోయారు.మమ్మల్నే బిల్లు అడుగుతావా అంటూ రెచ్చిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీఏకి ఫోన్ చేస్తామని... అది మత విద్వేషాలకు దారితీయవచ్చునని బెదిరించారు.

అరెస్ట్ చేసిన పోలీసులు

అరెస్ట్ చేసిన పోలీసులు

షాపు యజమాని ఎంతగా బతిమాలినా ఆ ఇద్దరూ వినిపించుకోకపోవడంతో ఇక చేసేది లేక పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. ఆ ఇద్దరు మద్యం మత్తులోనే ఈ రచ్చ చేసినట్లు గుర్తించారు. ఓ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తులుగా వీరిని గుర్తించారు. అయితే ఆ వివరాలేవి వెల్లడి కాలేదు. షాపులో రచ్చకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్‌లలోనూ...

మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్‌లలోనూ...

ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సాగర్ పటేల్(19),శంకర్(29) అనే ఇద్దరు వ్యక్తులు ఓ రెస్టారెంట్‌కు నిప్పంటించారు. రెస్టారెంటులో చికెన్ ఐటెమ్స్ లేవని చెప్పడంతో కోపోద్రిక్తులైన ఇద్దరు ఈ దాడికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఈతాహ్‌లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. వేడిగా లేని చపాతీలు పెట్టారన్న కోపంతో ఓ కస్టమర్ రెస్టారెంట్ యజమానిపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో అతని కాలికి తీవ్ర గాయాలయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+