ఇద్దరు దళిత బాలికలు మృతి.. మరొకరు సీరియస్.. పొలంలో విగతజీవులుగా...

ఉన్నావ్.. మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ సారి ఇద్దరు దళిత బాలిక మృతి చెందారని స్థానిక మీడియా తెలిపింది. ముగ్గురు బాలికలకు పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. వారిలో ఇద్దరూ చనిపోగా.. మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. చనిపోయిన ఇద్దరిపై గాయపడ్డ గుర్తులు కనిపించాయి.

 Two Dalits girls found dead in field in UPs Unnao

అశోహ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బాబురా గ్రామంలో ఘటన జరిగింది. పశువులకు గడ్డి (దాణా) తీసుకొచ్చేందుకు వారు పంట చేలకు వెళ్లారు. అక్కడ వారిపై దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆస్పత్రి వద్దకు కలెక్టర్, ఇతర అధికారులు చేరుకున్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు లక్నో నుంచి ఘటనా స్థలానికి ఐజీ, డీఐజీ వెళ్లారు.

పొలాల్లో ఆ ముగ్గురు సృహ కోల్పోయి కనిపించారు. వారిలో ఒకరి సోదరుడు జరిగిన ఘటనను మీడియాకు వివరించారు. తన సోదరి మధ్యాహ్నం 3 గంటలకు పశుగ్రాసం కోసం వెళ్లిందని.. సాయంత్రం అయినా తిరిగి రాలేదని చెప్పారు. దీంతో తాము వెతకడం ప్రారంభించామని తెలిపారు. వారిలో ఇద్దరు చనిపోయారని తెలిసిందని చెప్పారు. తమకు ఎవరితో శత్రుత్వం లేదని.. ఎవరిపై అనుమానం లేదని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+