భారత్ బంద్ ప్రారంభం-ట్రేడ్ యూనియన్ల పిలుపుతో దేశవ్యాప్తంగా-బ్యాంకుల మద్దతు
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రెండు రోజుల భారత్ బంద్ కు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ మేరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో బంద్ మొదలైంది. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం దీనికి మద్దతునిచ్చింది.
ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూ సహా పలు సంఘాలు బంద్ నిర్వహిస్తున్నాయి. హర్యానా చండీగఢ్ ట్రేడ్ యూనియన్లలో ఎస్మా విధించే అవకాశం ఉన్నప్పటికీ రోడ్డు మార్గాలు, రవాణా, విద్యుత్ శాఖల కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఏఐయూటీయూసీ, టీయూసీసీ, సెవా, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీతో కూడిన ఉమ్మడి ఫోరం బంద్ చేపడుతోంది.

బంద్ కారణంగా పలు రాష్ట్రాల్లో రవాణా, వ్యాపార, వాణిజ్యాలతో పాటు బ్యాంకింగ్ ఇతర కార్యకలాపాలు కూడా నిలిచిపోనున్నాయి. బ్యాంకు శాఖలు, కార్యాలయాలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బెంగళూరుకు చెందిన కెనరా బ్యాంక్ తెలిపింది. అయితే, బ్యాంక్ పనితీరుపై బంద్ ప్రభావం పడబోతంది. ప్రైవేట్ బ్యాంక్ RBL తమ బ్యాంక్ యూనియన్‌లు AIBOA, AIBEAలతో అనుబంధంగా ఉన్నాయని, ఈ యూనియన్‌లతో సంబంధం ఉన్న ఉద్యోగులు సమ్మెలో పాల్గొనవచ్చని పేర్కొంది. మార్చి 31న కూడా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కానున్నాయి.
Kerala | To protest against government policies, different trade unions have called for a nationwide strike/bandh today & tomorrow, March 28 & 29. Only emergency services are excluded from the strike.
— ANI (@ANI) March 28, 2022
Visuals from Thiruvananthapuram pic.twitter.com/wC3AbQ8Ied
కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేయనున్నట్లు కార్మిక సంఘం నేతలు ప్రకటించారు. విద్యుత్ (సవరణ) బిల్లు 2021ని ఉపసంహరించుకోవాలని, అన్ని రకాల ప్రైవేటీకరణ ప్రక్రియలను నిలిపివేయాలని, ముఖ్యంగా కేంద్ర పాలిత ప్రాంతాలైన చండీగఢ్, దాద్రా నగర్ హవేలీలలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయంపై విద్యుత్ శాఖ ఉద్యోగులు,ఇంజనీర్లు భగ్గుమంటున్నారు. విద్యుత్ బోర్డులను రద్దు చేసిన తర్వాత నియమితులైన విద్యుత్ ఉద్యోగులందరినీ పాత పెన్షన్ విధానంలో చేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
West Bengal | A 48 hours nationwide strike/bandh called by different trade unions to protest against govt policies to be observed today & tomorrow, March 28 & 29.
— ANI (@ANI) March 28, 2022
Visuals from Jadavpur, Kolkata pic.twitter.com/KIXENBe73Z
విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు నిర్వహించే యుటిలిటీలు మరియు ఇతర ఏజెన్సీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, జాతీయ గ్రిడ్ 24 గంటల విద్యుత్ సరఫరా, స్థిరత్వాన్ని కాపాడాలని సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, రీజనల్ లో డిస్పాచ్ సెంటర్లకు ఈ సూచనలు జారీ చేసింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications