మహిళలకు ఎంట్రీ ఉందా లేదా : భక్తుల కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయ ద్వారాలు
కేరళ: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనంకు కేసును బదిలీ చేసిన తర్వాత శనివారం రోజు తొలిసారిగా భక్తుల కోసం ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. శనివారం రోజున మండల పూజ జరగనుంది. అయితే కొత్తగా ఎలాంటి తీర్పు రానందున అన్ని వయస్సుల మహిళలు ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. ఇది గతేడాది వచ్చిన తీర్పునకు అనుగుణంగానే జరగనుంది. అయితే మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించడం లేదు.

శబరిమల ఆలయంలోకి వెళతానన్న తృప్తి దేశాయ్
శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించకపోవడంపై తొలి నుంచి గొంతెత్తుతున్న మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ నవంబర్ 20వ తేదీన శబరిమల ఆలయంకు వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పారు. తనకు భద్రతతో సంబంధం లేదని వెల్లడించారు. అయితే భక్తులు ఇప్పటికే శబరిమలకు చేరుకుంటుండగా మహిళలకు ప్రవేశం కల్పిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

కేసు పూర్వాపరాలు
కొన్ని దశాబ్దాలుగా శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయస్సున్న మహిళల ప్రవేశంపై ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు ఆంక్షలు విధించింది. ఇలా 1951 నుంచి మహిళలను ఆలయంలోకి ప్రవేశం కల్పించడం లేదు. ఇక మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పించకపోవడం అనే అంశానికి 1965లో చట్టబద్ధత తీసుకొచ్చారు. దీనిపై పిటిషన్ దాఖలు కాగా 1991లో కేరళ హైకోర్టు సమర్థించింది.

మహిళలకు ప్రవేశం ఉందంటూ గతేడాది తీర్పు
ఇక ఆ తర్వాత గతేడాది సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు మహిళలకు ప్రవేశం కల్పిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఇచ్చారు. అయితే తీర్పుపై హిందూ సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. పంబా, నీలక్కల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున్న నిరసన కార్యక్రమాలు అక్టోబర్ 17, 2018న జరిగాయి. ఆ రోజు తొలిసారిగా ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. నిరసనకారులు మహిళలను, జర్నలిస్టులను అడ్డుకోవడమే కాదు వారిపై దాడులకు దిగారు.
Recommended Video

విస్తృత స్థాయి ధర్మాసనం ఏర్పాటు
ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తిరిగి రివ్యూ పిటిషన్ దాఖలైంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏడుగురు సభ్యుల ధర్మాసనంకు కేసును బదిలీ చేసింది. శబరిమలతో పాటు ఇతర మతాల్లో కూడా మహిళలకు ఆంక్షలు ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అందువల్ల వీటన్నిటిపై సమీక్ష జరగాల్సి ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.మతం విశ్వాసాలపై చర్చ జరగాలని పిటిషనర్లు ఆశిస్తున్నారని కోర్టు వెల్లడించింది. దీంతో ఎవరికి వారు విజయం తమదేనంటూ చెప్పుకున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications