వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపటినుంచి రెండురోజులు సమ్మె.. బ్యాంకులు కూడా, కానీ పరిమిత సేవలు

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలకు వ్యతిరేకంగా రెండురోజులు స్ట్రైక్ చేయనున్నాయి. సోమవారం, మంగళవారం బ్యాంకు సిబ్బంది సమ్మెలో పాల్గొంటారు. సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్ కోసం సహకరించాలని సెంట్రల్ ట్రేడింగ్ యూనియన్ ఇటీవల జరిగిన సమావేశంలో వెల్లడించారు.

వర్కర్లకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా, జాతీయ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలకు నిరసన తెలియజేయనున్నారు. ఈపీఎఫ్ జమపై వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించిన విషయాన్ని 22వ తేదీన ఢిల్లీ జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. పెట్రోల్, ఎల్‌పీజీ, కిరోసిన్, సీఎన్‌జీ మొదలైనవాటిలో ఆకస్మిక పెంపుదల, మానిటైజేషన్ ప్రోగ్రామ్‌ అమలు చేయడానికి చర్యలు తీసుకుంటోంది.

two days are strike in the country:trade unions

ద్రవ్యోల్బణం, క్రాష్ అవుతున్న షేర్ మార్కెట్ల కారణంగా మాత్రమే వాటిని నిలిపివేశారు. సమావేశాంలో ఇటువంటి విధానాలన్నింటినీ ఖండించారు. గ్రామీణ బంద్‌ను పాటిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా చేసిన ప్రకటనకు సమావేశంలో మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొనాలని రాష్ట్ర స్థాయిల్లోని వివిధ సంఘాలకు సమావేశం విజ్ఞప్తి చేసింది. కేంద్ర కార్మిక సంఘాలు INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC ఇందులో ఉన్నాయి.

బ్యాంకింగ్ రంగం సైతం సమ్మెలో పాల్గొంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫేస్‌బుక్‌లో తెలిపింది. బ్యాంక్ సమ్మె రోజులలో తమ బ్రాంచ్‌లు, వాటి ఆఫీసులలో సాధారణ పనితీరును నిర్ధారించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, సమ్మె కారణంగా బ్యాంకులో పని పరిమిత స్థాయిలో మాత్రమే జరగొచ్చని ఒక ప్రకటనలో ఎస్బీఐ తెలిపింది.

English summary
two days are strike in the country trade unions said in the statement. banks also may not worked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X