సునంద పుష్కర్ మృతి: పోలీసులు భయపడ్తున్నారా?
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతికి సంబంధించి నమైదైన కేసు దర్యాఫ్తు విషయమై ఢిల్లీ పోలీసుల్లోని వివిధ విభాగాల మధ్య బదలీ అవుతుండటం చర్చకు దారి తీస్తోంది. సునంద పుష్కర్ మృతికి సంబంధించిన కేసుపై పోలీసులు ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది.
సునందా అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కొనసాగించే విషయమై ఢిల్లీ పోలీసు విభాగంలోని రెండు శాఖలు కీచులాడుకుంటున్నాయి. ఈ కేసును ఈ నెల 23వ తేదీన ఢిల్లీ క్రైమ్ బ్రాంచి విభాగానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే దర్యాప్తు ప్రారంభించేందుకు క్రైమ్ బ్రాంచి నిరాకరించడంతో ఈ కేసును మళ్లీ దక్షిణ జిల్లా పోలీసులకు బదిలీ చేసినట్టు పోలీసులు తెలిపారు.

శశిథరూర్ - సునందా పుష్కర్‌ల వివాహం జరిగి ఏడేళ్లు కూడా కాకపోవడంతో చట్ట ప్రకారం తొలుత ఈ కేసును సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం)కు అప్పగించారు. దీంతో ఈ కేసుపై ఎస్‌డిఎం విచారణ జరిపి, వారం రోజుల్లో దక్షిణ జిల్లా పోలీసులకు నివేదిక సమర్పించారు.
పుష్కర్ మృతికి విష ప్రయోగమే కారణమని పోస్టుమార్టంలో వెల్లడవడంతో ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు నిర్వహించాలని ఎస్‌డిఎం సూచించారు. ఆ మరుసటి రోజు దర్యాప్తును ప్రారంభించాల్సిన దక్షిణ జిల్లా పోలీసులు ఈ కేసు దర్యాప్తును క్రైమ్ బ్రాంచికి అప్పగించారు.
అయితే ఈ కేసులో దర్యాప్తు జరిపేందుకు ఏమీ మిగల్లేదని పేర్కొంటూ క్రైమ్ బ్రాంచి అధికారులు దర్యాప్తు జరిపేందుకు నిరాకరించారు. సిబ్బంది కొరతతో సమతమతమవుతున్న తమ శాఖ వద్ద ఇప్పటికే పలు పెండింగ్ కేసులు ఉన్నాయని, కనుక మరిన్ని కేసులు దర్యాప్తు జరపగలిగే పరిస్థితి లేదని క్రైమ్ బ్రాంచికి చెందిన మరో అధికారి చెప్పారట. ఈ కేసును వెనక్కి పంపినట్లుగా తెలుస్తోంది.
శశిథరూర్ రాజీనామాకు డిమాండ్
సునంద పుష్కర్ మృతి నేపథ్యంలో శశిథరూర్ రాజీనామా చేయాలని కేరళ సిపిఎం శాఖ డిమాండ్ చేసింది. ఆయన స్వచ్చంధంగా రాజీనామా చేయకుంటే ప్రధానమంత్రి ఆయనను మంత్రివర్గం నుండి తొలగించాలని చెప్పింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications