కరాచీలో 15 రోజులు ఉగ్రవాద శిక్షణ పొందిన ఆ ఇద్దరు-లక్నో టు పాక్ వయా ఒమన్-వెలుగులోకి సంచలన విషయాలు
కొద్దిరోజుల క్రితం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు అనుమానిత పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులకు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూశాయి. లక్నో నుంచి పాకిస్తాన్ వెళ్లిన ఈ ఇద్దరు అక్కడ 15 రోజుల పాటు ఐఎస్ఐ వద్ద ఉగ్రవాద శిక్షణ పొందారు. పేలుడు పదార్థాలు,మారణాయుధాలను ఉపయోగించడంలో థీరిటికల్,ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందారు. ఇండియన్ ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం... 22 ఏళ్ల ఒసామా,28 ఏళ్ల జీషన్ ఖమర్ అనే ఇద్దరు వ్యక్తులు లక్నో నుంచి ఒమన్‌కి వెళ్లి.. అక్కడి నుంచి ఇరాన్ మీదుగా పాకిస్తాన్ చేరుకున్నారు. అక్కడ ఐఎస్ఐ వద్ద శిక్షణ ముగిశాక తిరిగి అదే రూట్‌లో ఇండియా చేరుకున్నారు.

ఎప్పుడు,ఎక్కడినుంచి,ఎలా వెళ్లారు...
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో విమానాశ్రయం నుంచి ఏప్రిల్ 21,2021న సలాం ఎయిర్ ఫ్లైట్‌లో ఒసామా ఒమన్ రాజధాని మస్కట్‌కి చేరుకున్నాడు. అక్కడ బంగ్లా భాష మాట్లాడే క్యాబ్ డ్రైవర్ ఒకరు అతన్ని రిసీవ్ చేసుకున్నాడు. అక్కడినుంచి హోటల్ బొషర్‌కు ఒసామాను తీసుకెళ్లి... పాకిస్తాన్‌కు చెందిన ఆ హోటల్ మేనేజర్‌కు అప్పగించాడు. అదే హోటల్‌లో ఒసామా ఖమర్‌ను కలుసుకున్నాడు. ఒమన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం... అదే హోటల్‌లో ఇద్దరు ఏడు రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉన్నారు.

సముద్ర మార్గంలో ఇరాన్‌కు...
క్వారెంటైన్ ముగిశాక ఇద్దరు అల్ ఖద్రా ప్రాంతానికి వెళ్లారు.అక్కడ బంగ్లాదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి వీరిని రిసీవ్ చేసుకుని... ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఇంటికి తీసుకెళ్లాడు.అక్కడ అప్పటికే మరో 15 మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఉన్నారు.అక్కడ నాలుగు రోజులు ఉన్నాక... అక్కడి నుంచి సొహర్ షోర్ ప్రాంతం మీదుగా ఓ స్పీడ్ బోట్ సాయంతో ఇరాన్‌లోని బందర్ ఇ జస్క్ పోర్టుకు చేరుకున్నారు. ఐదు గంటల పాటు సాగిన ఆ ప్రయాణంలో ఎండ వేడిమి,డీహైడ్రేషన్‌కు తట్టుకోలేకపోయారు.

ఇరాన్ నుంచి పాకిస్తాన్‌కు... 15 రోజుల శిక్షణ
అక్కడ ఓ ఇరాన్ దేశస్తుడు ఒకరు వీరిని రిసీవ్ చేసుకుని... అక్కడి నుంచి చహబార్ పోర్టుకు తీసుకెళ్లాడు. 10-12గంటల జర్నీ తర్వాత అక్కడికి చేరుకున్నారు.అక్కడ రెండు రోజులు గడిపాక... పాకిస్తాన్ సమీపంలోని సముద్ర తీర ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ పాకిస్తాన్ నేవీకి చెందిన కల్నల్,సెక్యూరిటీ గార్డ్స్ వారిని రిసీవ్ చేసుకుని కారులో కరాచీలోని ఓ ఫాంహౌస్‌కు తరలించారు. ఆ ఫాంహౌస్‌లో ఒసామా,ఖమర్ ఇద్దరూ 15 రోజుల పాటు మారణాయుధాలను ఉపయోగించడం,ఐఈడీ లాంటి పేలుడు పదార్థాలను పేల్చడంలో శిక్షణ పొందారు. అంతేకాదు,కమర్షియల్ మార్కెట్స్ లేదా భవనాలకు ఎలా నిప్పంటించాలో నేర్చుకున్నారు. శిక్షణ అనంతరం ఇద్దరికీ వీడ్కోలు పార్టీ కూడా ఇచ్చారు. అనంతరం ఆ ఇద్దరు ఇరాన్,ఒమన్ మీదుగా మళ్లీ భారత్‌కి చేరుకున్నారు.
Recommended Video

ఈ నెల 14న అరెస్ట్...
గణేశ్ చతుర్థి,నవరాత్రి,రామ్‌లీలా సందర్భంగా ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ఉగ్రవాదులు బాంబు దాడులకు ప్లాన్ చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించడంతో సెప్టెంబర్ 14న ఈ ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరితో పాటు మహమ్మద్ షేక్(47) అలియాస్ సమీర్,మూల్‌చంద్(47),మహమ్మద్ అబూ బకర్(23),మహమ్మద్ అమీర్ జావెద్(31)లను పోలీసులు అరెస్ట్ చేశారు.20 ఏళ్ల క్రితం మహమ్మద్ షేక్‌కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ కంపెనీతో లింకులు ఉన్నట్లు మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వెల్లడించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications