వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముదిరిన వివాదం , బాహా బాహీ కి దిగిన అఖిలేష్, శివపాల్ మద్దతుదారులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీలో ముసలం మరింత ముదిరింది.పార్టీలో కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు.కొందరు షిఎం అఖిలేష్ వర్గానికి మద్దతుగా నిలవగా,మరికొందరు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ కు మద్దతుగా నిలిచారు. రెండు వర్గాలకుచెందిన మద్దతుదారులు సోమవారం నాడు పార్టీ కార్యాలయం వద్ద బాహా బాహీకి దిగారు.పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

రెండు మూడు రోజులుగా సమాజ్ వాదీ పార్టీలో కీలకపరిణామాలు చోటుచేసుకొంటున్నాయి..ఆదివారం నాడు మంత్రివర్గం నుండి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ తో సహా నలుగురికి ముఖ్యమంత్రి అఖిలేష్ ఉద్వాసన పలికారు.అమర్ సింగ్ కు సన్నిహితురాలుగా ఉన్న ఎప్ డి సి చైర్మెన్ జయప్రద కూడ పదవిని కోల్పోయారు.సమాజ్ వాదీ పార్టీలో రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. కొందరు ముఖ్యమంత్రి అఖిలేష్ ను పపోర్ట్ చేస్తుండగా, మరికొందరు శివపాల్ యావవ్ ను సపోర్ట్ చేస్తున్నారు.ములాయం కు వరుసకు సోదరుడు రామ్ గోపాల్ సిఎం అఖిలేష్ కు మద్దతుగా నిలిచారు.దీంతో ఆయనను పార్టీ నుండి తొలగించారు. వచ్చే నెల 5వ, తేదితో పార్టీని స్థాపించి 25 ఏళ్ళు పూర్తి కానుంది.దీనిపై చర్చించేందుకు ఇవాళ లక్నోలో పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి తాను కూడ హాజరుకానున్నట్టు అఖిలేష్ ప్రకటించారు.దీంతో రెండు వర్గాల మద్దతుదారులు పార్టీ కార్యాలయం వద్దకు బారీగా చేరుకొన్నారు.

Two groups clash at party of sp in Uttarpradesh

పార్టీ సమావేశం ప్రారంభానికి ముందే రెండు వర్గాలకు చెందిన మద్దతుదారులు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. వాగ్వావాదానికి దిగారు.ఒకరిపై విమర్శలు చేసుకొన్నారు. ఒకానొక దశలో బాహాబాహికి కూడ పాల్పడ్డారు. పరిస్థితి చేయి దాటుతుండడంతో పోలీసులు రెండు గ్రూపులను చెదరగొట్టారు. రెండు గ్రూపులు తమ ఆధిపత్యాన్ని ప్రధర్శించుకొనేందుకు పార్టీ కార్యాలయాన్ని వేదికగా ఎంచుకొన్నారు.

పార్టీలో ముసలానికి అఖిలేష్ ను కొందరు తప్పుదోవపట్టించడమే కారణమని....శివపాల్ యాదవ్ వర్గం వాదిస్తోంది. పార్టీలో ప్రస్తుత సంక్షోభానికి అమర్ సింగ్ రీ ఎంట్రీయే కారణమని అఖిలేష్ యాదవ్ వర్గం వాదిస్తోంది. అఖిలేష్ ను రాంగోపాల్ యాదవ్ తప్పుదోవపట్టిస్తున్నారని శివపాల్ వర్గం చెబుతోంది.శివపాల్ వర్గం చేస్తోన్న వాదనలను అఖిలేష్ వర్గం కొట్టిపారేస్తోంది.

English summary
Uttar pradesh cm akhilesh supporters and U.P. samajwadi party president shivpal yadav supporters are clash at party office before start party meeting.there is party meeting Monday..akhilesh announced he will be participate that meeting ,so two groups clash at party office.police lotty charged two groups.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X