హుజి ఉగ్రవాదికి సహకరించిన ఇద్దరి అరెస్ట్, ఒకరిది జహీరాబాద్
న్యూఢిల్లీ: హుజీ ఉగ్రవాది నజీర్‌కు సహకరించిన ఇద్దరిని హైదరాబాద్ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా జహీరాబాదుకు చెందిన షేక్‌నూర్, ఢిల్లీకి చెందిన హసీమ్‌లను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. వారిని హైదరాబాదుకు తీసుకు వచ్చారు.
భాగ్యనగరం పైన పంజా విసిరేందుకు ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తున్నారు. పోలీసులు ఉగ్రవాదులకు చెక్ చెపుతూ వస్తోన్నారు. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విధ్వంసానికి ప్లాన్ చేసిన హుజీ ముష్కరులను ముందుగానే పసిగట్టిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
దీంతో, వారి కుట్ర భగ్నమైంది. ఆనాడు పోలీసుల చేతికి చిక్కిన హుజీ ఉగ్రవాది నజీర్‌ను పోలీసులు విచారించారు. తద్వారా మరిన్ని విషయాలు రాబట్టారు.

నజీర్ నుంచి సమాచారం రాబట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన గ్యాంగుకు చెందిన మరో ఇద్దర్ని సోమవారం అరెస్టు చేశారు. వారు హైదరాబాదు నుంచి పరారై ఢిల్లీలో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్లి ఇద్దరు ఉగ్రవాదులు షేక్ నూర్, హకీమ్‌లను అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు హైదరాబాదు తీసుకొచ్చారు. నజీర్‌కు వీరిద్దరూ సహకరించినట్లు పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
-
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..












Click it and Unblock the Notifications