ఆమెది హత్యే: అత్యాచారం చేసి చంపేశారు, ఇదీ జరిగింది!..
తిరువనంతపురం: విదేశీ మహిళ లిగా స్క్రోమనే హత్య కేసు మిస్టరీ వీడింది. ఆయుర్వేద చికిత్స కోసం కేరళ వచ్చిన ఆమె మార్చి 14వ తేదీ నుంచి అదృశ్యమైపోయింది. ఇటీవలే కుళ్లిపోయిన స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.
తాజా దర్యాప్తులో లిగా స్క్రోమనేది హత్యగా తేల్చారు కేరళ పోలీసులు. ఉమేష్, ఉదయన్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టుగా నిర్దారించారు. వారిద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

మానసిక స్థితి సరిగా లేని లిగా స్క్రోమనే మార్చి 14వ తేదీన అదృశ్యమయ్యాక.. ఉదయన్, ఉమేష్ ల కంటపడింది. మాదకద్రవ్యాలు విక్రయించే ఈ ఇద్దరు ఆమెను మాటలతో మభ్యపెట్టి తమతో తీసుకెళ్లారు. సుందరమైన ప్రదేశాలను చూపిస్తామని చెప్పడంతో.. వారి మాటలు నమ్మి లిగా వెంట వెళ్లింది.
లిగాను ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు ఆమెకు బలవంతంగా మాదకద్రవ్యాలు ఇచ్చి అత్యాచారం చేశారు. ఆపై గొంతునులిమి హత్య చేశారు. అయితే దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు లిగా మృతదేహాన్ని ఉరేసి అక్కడినుంచి పరారయ్యారు. దాదాపు నెలరోజులు మృతదేహం అదే స్థితిలో ఉండటంతో.. తల నుంచి మొండెం వేరైంది. కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని కేరళ డీజీపీ లోకనాథ్ మీడియాకు తెలిపారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications