శ్రీనగర్ లో లష్కర్ మిలిటెంట్ల హతం
శ్రీనగర్: భద్రతా దళాల కాల్పులలో ఇద్దరు లష్కర్-ఏ-తోయిబా మిలిటెంట్లు అంతం అయ్యారు. మిలిటెంట్ల ఎదురు కాల్పులలో స్థానిక పోలీసుకు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా లో మిలిటెంట్లు చొరబడుతున్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది. సోమవారం అర్దరాత్రి మిలిటెంట్ల కోసం గాలించారు. స్థానిక పోలీసులు భద్రతా దళాలకు సహకరిస్తు మిలిటెంట్ల కోసం వేట ప్రారంభించారు.
మంగళవారం వేకువ జామున రత్నిపూర ప్రాంతంలో మిలిటెంట్లు ఎదురుపడ్డారు. లోంగిపోవాలని భద్రతా దళాలు హెచ్చరించాయి. అయితే మిలిటెంట్లు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు.

గంటకు పైగా జరిగిన ఈ కాల్పులలో ఇద్దరు మిలిటెంట్లు అంతం అయ్యారని పోలీసు అధికారులు తెలిపారు. బుల్లెట్ గాయాలైన పోలీసుకు స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి శ్రీనగర్ కు తరలించామని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.
భద్రతా దళాల కాల్పులలో మరణించిన ఇద్దరు మిలిటెంట్లు లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు అని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. అయితే వారి పేర్లు, వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ముందు జాగ్రత చర్యగా సరిహద్దు ప్రాంతాలలో గస్తి ముమ్మరం చేశారు.
నిరసన ర్యాలి........ ఫైరింగ్.............!
ఈ ఎన్ కౌంటర్ కు నిరసనగా మంగళవారం పుల్వామా జిల్లాలో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే వారు రెచ్చిపోవడంతో భద్రతా దళాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో పడ్గంపురా గ్రామానికి చెందిన బిలాల్ మహమ్మద్ (23) అనే యువకుడు మరణించాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications