అన్నను కట్టేసి అక్కాచెల్లెళ్లపై 15 మంది గ్యాంగ్ రేప్
పాట్నా: దేవాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరిన ఇద్దరు బాలికల మీద గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన బీహార్ లో జరిగింది. బీహార్ లోని సాసారామ్ జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
దళిత గ్రామంలో నివాసం ఉంటున్న 13,14 సంవత్సరాల ఇద్దరు బాలికలు 7వ,8వ తరగతి చదువుతున్నారు. ఈ అమ్మాయిలు దళితులు. సోంత అక్కా,చెల్లి. బుధవారం సాయంత్రం వీరు సోదరుడితో కలిసి పక్క గ్రామంలోని దేవాలయం దగ్గరకు వెళ్లి పూజలు చేశారు. తరువాత ముగ్గురు ఇంటికి బయలుదేరారు.

మార్గం మద్యలో 15 మంది యువకులు వీరిని అడ్డగించారు. తరువాత బాలికలను ఎత్తుకుని నిర్మానుష్యమైన ప్రదేశంలోకి వెళ్లారు. బాలికల సోదరుడిని పక్కకు తీసుకు వెళ్లి కట్టేశారు. 15 మంది కామాంధులు ఇద్దరు బాలికల మీద వరుసగా అత్యాచారం చేశారు.
ఇంటికి వెళ్లిన బాలికలు జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలికలను వైద్య పరిక్షలకు తరలించారు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న యువకులే బాలికల మీద అత్యాచారం చేసి ఉంటారని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications