దారుణం: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మైనర్లపై అత్యాచారం

శనివారం మధ్యాహ్నం మామడి పండ్ల కోసం గ్రామ సమీపంలోని మామిడి తోటకు వెళ్లిన ఐదేళ్ల బాలికను అపహరించిన 14ఏళ్ల బాలుడు ఆమెపై అత్యాచారానికి పాల్పాడ్డాడు. ఆ తర్వాత అతడు గ్రామం నుంచి పారిపోయాడు. ఘటనా స్థలంలోనే ఏడ్చుకుంటూ ఉన్న బాలికను చూసిన గ్రామస్తులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడ్ని ఆదివారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద మొబైల్ ఫోన్‌లో ఎక్కువ మొత్తంలో పోర్నోగ్రాఫిక్ వీడియోలున్నాయని పోలీసులు చెప్పారు.
మరో ఘటన రాంపూర్ కలాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పొలంలో పని చేసేందుకు తల్లితోపాటు వెళ్లిన ఎనిమిదేళ్ల బాలికను తల్లికి దూరంగా ఉన్న సమయంలో రాజు(19) అనే యువకుడు కిడ్నాప్ చేశాడు. మరో గ్రామ సమీపంలోకి తీసుకెళ్లిన నిందితుడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నిందితుడు రాజు అక్కడ్నుంచి పరారయ్యాడు.
బాలిక తీవ్ర రక్తస్రావం కావడంతో సాయం కోసం కేకలు పెట్టింది. అటువైపుగా వెళుతున్న వారు చూసి ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడు చహర్పూర్ గ్రామానికి చెందిన వాడని పోలీసులు చెప్పారు. నిందితులిద్దర్నీ కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications