షాక్: ఎమ్మెల్యేలా మజాకా: దినకరన్ కు హ్యాండ్ ఇచ్చి పళని, పన్నీర్ తో బేరం పెట్టారు !

తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న టీటీవీ దినకరన్ కు గురువారం వరకు ఆయన వర్గంలో ఉన్న ఇద్దరు ఎమ్మెలు షాక్ ఇచ్చారు. మేము ఏ వర్గంలో లేమని తటస్థంగా ఉన్నామని ఇద్దరు ఎమ్మెల్యే బాంబు పేల్చడం

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న టీటీవీ దినకరన్ కు గురువారం వరకు ఆయన వర్గంలో ఉన్న ఇద్దరు ఎమ్మెలు షాక్ ఇచ్చారు. మేము ఏ వర్గంలో లేమని తటస్థంగా ఉన్నామని ఇద్దరు ఎమ్మెల్యే బాంబు పేల్చడంతో దినకరన్ హడలిపోయారు.

తమిళనాడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తోపు వెంకటాచలం, మరో ఎమ్మెల్యే రత్నసభాపతి గురువారం మద్యాహ్నం దినకరన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. తాము ఎడప్పాడి పళనిసామి వర్గంలో లేమని, పన్నీర్ సెల్వం వర్గంలో లేమని, దినకరన్ వర్గంలో కూడా లేమని తేల్చి చెప్పారు.

Two MLAs stays neutral seems be supporting TTV Dinakaran

తటస్టంగా ఉన్నమని చెప్పిన ఎమ్మెల్యేలు తోపు వెంకటాచలం, రత్నసభాపతి ఎడప్పాడి పళనిసామి వర్గంతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. తమకు మంత్రి పదవులు ఇస్తే మరో ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకుని మీ వర్గంలోకి వచ్చేస్తామని తోపు వెంకటాచలం, రత్నసభాపతి బేరం పెట్టారని సమాచారం.

ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు మిత్రపక్ష ఎమ్మెల్యేలు ఏ వర్గంలో లేకుండా తటస్థంగా ఉన్నారు. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం బలపరీక్షలో మెజారిటీ నిరూపించుకోవాలంటే ఐదు మంది ఎమ్మెల్యేలు అవసరం. తోపు వెంకటాచలం ఐదు మంది ఎమ్మెలతో బయటకు వస్తే దినకరన్ దిమ్మతిరిగిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+