నటి సింధు మీనన్ ఫ్యామిలీ: మరో రెండు బ్యాంకులకు కుచ్చుటోపి, అమెరికాలో, కేటుగాడు!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహించిన చందమామ సినిమా ఫేం, బహుబాష నటి సింధు మీనన్ సోదరుడు మనోజ్ కార్తికేయన్ వర్మా మీద బ్యాంకును మోసం చేశారని ఇప్పటికే బెంగళూరులోని ఆర్ ఎంసీ యార్డు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. అయితే ఇప్పుడు సింధు మీనన్ సోదరుడు బీఎండబ్లూ కార్ల షోరూం, ప్రభుత్వ ఉద్యోగి ఇంటి నకిలీ పత్రాలు రెండు బ్యాంకులకు సమర్పించి మోసం చేశారని బెంగళూరులోని సంజయ్ నగర్, యశవంతపురం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.

కిలాడి కేటుగాడు

కిలాడి కేటుగాడు

బెంగళూరు నగరంలోని సంజయ్ నగర్ లో నవీన్ మోటార్స్ బీఎండబ్లూ కార్ల షోరూం ఉంది. ఈ షోరూం పేరుతో నటి సింధు మీనన్ సోదరుడు మనోజ్ కార్తికేయన్ వర్మా నకిలీ పత్రాలు తయారు చేసి ఆక్సిస్ బ్యాంకులో అకౌంట్ ప్రారంభించాడు.

విజయా బ్యాంకు

విజయా బ్యాంకు

కొన్ని నకిలీ పత్రాలు తయారు చేసిన మనోజ్ కార్తికేయన్ వర్మా విజయ బ్యాంకులో సమర్పించి బీఎండబ్లూ కారు కొనుగోలు చెయ్యడానికి రుణం ఇవ్వాలని మనవి చేశాడు. నకిలీ పత్రాలతో పాటు ఆక్సిస్ బ్యాంకు అకౌంట్ జత చేశాడు.

గుడ్డిగా అధికారులు !

గుడ్డిగా అధికారులు !

మనోజ్ కార్తికేయన్ వర్మా సమర్పించిన పత్రాలు సక్రమంగా పరిశీలించుకుండా విజయా బ్యాంకు అధికారులు ఆక్సిస్ బ్యాంకు అకౌంట్ లో రూ. 35 లక్షలు డిపాజిట్ చేశారు. తరువాత మనోజ్ కార్తికేయన్ వర్మా నగదు డ్రా చేసుకుని జల్సా చేశాడు.

మోసం జరిగింది

మోసం జరిగింది

విజయా బ్యాంకు అధికారులు బీఎండబ్లూ కారు పత్రాలు తీసుకురావాలని సూచించినా మనోజ్ కార్తికేయన్ వర్మా మాత్రం తప్పించుకు తిరుగుతున్నాడు. మోసం జరిగిందని గుర్తించిన విజయా బ్యాంకు అధికారులు సంజయ్ నగర పోలీసులను ఆశ్రయించడంతో మనోజ్ కార్తికేయన్ వర్మా మీద కేసు నమోదు అయ్యింది.

 సింధూ మీనన్ తల్లి

సింధూ మీనన్ తల్లి

బెంగళూరు నగరంలోని యశవంతపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బీఎంటీసీ (బెంగళూరు సిటీ బస్సులు) ఉద్యోగి గణేష్ రావ్ నివాసం ఉంటున్నారు. గణేష్ రావ్ కట్టడాన్ని సింధూ మీనన్ తల్లి దేవీ మీనన్, మనోజ్ కార్తికేయన్ వర్మా అద్దెకు తీసుకున్నారు.

ఇంటి పత్రాలు, ఐడీ కార్డు

ఇంటి పత్రాలు, ఐడీ కార్డు

గణేష్ రావ్ కు చెందిన ఇంటి పత్రాలు, ఆయన బీఎంటీసీ గుర్తింపు కార్డు చోరీ చేసిన మనోజ్ కార్తికేయన్ వర్మా వాటిని బ్యాంకులో సమర్పించి రుణం కావాలని మనవి చేశాడు. బ్యాంకు అధికారులు గణేష్ రావు పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు.

బ్యాంకు అధికారుల లేఖ

బ్యాంకు అధికారుల లేఖ

మీ ఇంటి పత్రాలు పరిశీలించామని, మీకు రుణం ఇవ్వలేమని బ్యాంకు అధికారులు గణేష్ రావ్ కు లేఖ పంపించారు. తాను రుణం కావాలని బ్యాంకుకు ఎలాంటి పత్రాలు సమర్పించలేదని గణేష్ రావ్ బ్యాంకు అధికారులకు చెప్పారు. బ్యాంకు అధికారులు వారి దగ్గర ఉన్న పత్రాలు గణేష్ రావ్ కు చూపించారు.

వాస్తు చెబుతామని !

వాస్తు చెబుతామని !

గణేష్ రావ్ కట్టడాన్ని ప్రజలకు వాస్తు చెప్పడానికి సింధు మీనన్ తల్లి దేవీ మీనన్, మనోజ్ కార్తికేయన్ అద్దెకు తీసుకున్నారు. ఇంటి పత్రాలు, తన బీఎంటీసీ ఐడీ కార్డు చోరీ చేసి దుర్వినియోగం చేశారని గణేష్ రావ్ ఫిర్యాదు చెయ్యడంతో యశవంతపురం పోలీస్ స్టేషన్ లో వారి మీద కేసు నమోదు అయ్యింది.

సింధు మీనన్ హ్యాండ్ !

సింధు మీనన్ హ్యాండ్ !

ఈ మూడు చీటింగ్ కేసుల్లో నటి సింధు మీనన్ కు ప్రమేయం ఉంటుందని, ఆమె అమెరికా నుంచి వచ్చిన తరువాత విచారణ చెయ్యాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ మూడు కేసుల్లో తన సోదరి సింధు మీనన్ కు ఎలాంటి సంబంధం లేదని మనోజ్ కార్తికేయన్ చెబుతున్నాడని, అయితే మాపని మేము చేస్తామని పోలీసులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
two more fir filed against actress Sidhu Menons brother in Bengaluru in karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి