రాబర్ట్ వాద్రా ల్యాండ్ డీల్: ఫైళ్లోంచి రెండు పేజీలు మాయం
చండీగడ్: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. వివాదాస్పద రాబర్ట్ వాద్రా - డిఎల్ఎఫ్ గుర్గావ్ భూముల డీల్‌కు సంబంధించిన ఫైల్‌లోంచి రెండు కీలకమైన పేజీలు మాయమైనట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
భూముల ఒప్పందం రద్దయిన సమయంలో ఐఎఎస్ అధికారి అశోక్ ఖేమ్కా డైరెక్టర్ జనరల్ (కన్సాలిడేషన్)గా ఉన్నారు. ఆ ఫైల్ ప్రతి కావాలంటూ ఆర్‍టిఐ దరఖాస్తు పెట్టుకున్నారు. ఖేమ్కాకు భూ లావాదేవీల ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం ఉందా, లేదా పరిశీలించడానికి ముగ్గురు సభ్యుల ప్యానెల్‌కు సంబంధిచిన ఫైల్ అది. ఆ ప్యానెల్‌ను గత హర్యానా ప్రభుత్వ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా నియమించారు.

ఆ భూ ఒప్పందానికి పచ్చ జెండా ఊపుతూ ముగ్గురు సభ్యుల కమిటీ ప్రవర్తనాలోపానికి ఖేమ్కాపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఖేమ్కా పెట్టుకున్న ఆర్‌టిఐ దరఖాస్తుకు రాష్ట్ర ప్రజా సమాచార అధికారి డిఆర్ వాధ్వా ప్రతిస్పందించారు
అధికారిక ఫైల్‌లోని ఒకటి, రెండు పేజీలను కనిపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశామని, అయితే అవి లభించలేదని, అందువల్ల ఆ పేజీలను అందించలేమని వాధ్వా ఖేమ్కాకు సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఖేమ్కా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications