• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మత కల్లోలాలు చెలరేగుతున్నాయంటూ వదంతులు.. ఇద్దరి అరెస్టు: పుకార్లు పుట్టిస్తే

|

లక్నో: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన అనంతరం వదంతులను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని నొయిడాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై తీర్పు వెలువరించిన రెండు గంటల్లోనే.. వదంతులను వ్యాపింపజేయడానిక వారు ప్రయత్నించినట్లు ఉత్తర్ ప్రదేశ్ లోని గౌతమ బుద్ధ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వైభవ్ కృష్ణ తెలిపారు.

తీర్పు తరువాత అయోధ్య ఎలా ఉందంటే..? రామజన్మభూమి వాసుల మనోగతం.. ముస్లింలు కూడా.. !

నొయిడాలో మత కల్లోలాలను సృష్టించడానికి కుట్ర పన్నినట్లు ఓ వ్యక్తి 100 ద్వారా కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి, సమాచారాన్ని ఇచ్చాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ పరిస్థితి అంతా సాధారణంగా కనిపించింది. అపరిచితుడు ఇచ్చిన సమాచారంపై కొంతమంది స్థానికులను కూడా ప్రశ్నించారు. మత కల్లోలాలకు కుట్ర పన్నినట్లు అతను చెప్పడం అబద్దమని తేలింది. దీనితో ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు. మత కల్లోలాలపై ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలను ఇచ్చాడని, దీనితో అతణ్ని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Two people were taken into preventive custody for allegedly spreading rumours on the Ayodhya verdict in Noida

మరో ఘటనలో- మత ఘర్షణలు చెలరేగడానికి కారణం అయ్యేలా, అలాంటి చర్యలను ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేసిన కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. అతను ఓ రాజకీయ పార్టీకి చెందిన పదాధికారిగా గుర్తించారు. తోటి వర్గం వారిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆ రాజకీయ నాయకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. ఈ ఘటన కూడా నొయిడాలోనే చోటు చేసుకుంది. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు చేయడాన్ని ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two people were taken into preventive custody on Saturday for allegedly spreading rumours on the Supreme Court's verdict in the Ayodhya land dispute case, police said. "One of them had called up the police on its emergency number 100 to report a planned violence by a community but his claims were found untrue," Senior Superintendent of Police, Gautam Buddh Nagar, Vaibhav Krishna,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more