ఒకే తాడుకు చెట్టుకు వేలాడుతూ ఇద్దరు అమ్మాయిలు...

ఇద్దరు అమ్మాయిలు కూడా గత బుధవారం సాయంత్రంనుంచి కనిపించడం లేదని పోలీసులు శుక్రవారం చెప్పారు. తల్లిదండ్రులు వీరికోసం అన్ని చోట్లా వెతికారని, అయినా వారి జాడ తెలియలేదని వారు చెప్పారు. మరుసటి రోజు ఉదయం ఈ బాలికల్లో ఒకరి బంధువు ఈ ఇద్దరి మృతదేహాలు ఒక చెట్టుకు వేళ్లాడుతూ ఉండడం కనిపించింది.
ఈ చెట్టు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బాలికలను మొదట రేప్ చేసి ఆ తర్వాత తమ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారిని చంపేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇద్దరు బాలికలు ఒకే తాడుకున్న రెండు కొనలకు వేళ్లాడుతున్నారని పోలీసులు చెప్పారు.
స్థానికులు సమాచారం ఇవ్వడంతో గురువారం నాడు సంఘటనాస్థలానికి ఒక పోలీసు బృందం వెళ్లిందని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని వాటిని పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షలకోసం పంపించినట్లు కరీంగంజ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ నబీన్ సింగ్ చెప్పారు. పోస్టుమార్టం నివేదిక కోసం తాము ఎదురు చూస్తున్నామని, మృతికి కారణాలేమిటో, అత్యాచారం కోణం ఏదయినా ఉందా అనే విషయం పోస్టుమార్టంలో మాత్రమే తేలుతుందని సింగ్ చెప్పారు.












Click it and Unblock the Notifications