జమ్మూలో పాక్ గూడఛారుల అరెస్ట్?
భారత్ - పాక్ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను సైన్యం అదుపులోకి తీసుకుంది. అరెస్టైన ఇద్దరూ పాకిస్థాన్ గూఢచారులై ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జవాన్లు ఇద్దరు వ్యక్తులు ఆర్మీ క్యాంప్, దాని పరిసర ప్రాంతాల ఫొటోలు, వీడియో తీస్తున్నట్లు గుర్తించారు.
వెంటనే అప్రమత్తమై జవాన్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని అదుపుకి తీసుకుని ప్రశ్నించారు.ఫొటోలు, వీడియో తీసిన వ్యక్తుల్లో ఒకరు కథువా, మరొకరు దొడా ప్రాంతానికి చెందిన వారని పోలీసుల విచారణలో తేలింది. ఆర్మీ క్యాంపు ఫొటోలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించగా సరైన జవాబు రాలేదు. దీంతో పోలీసులు వారిద్దరి సెల్‌ఫోన్లు తీసుకుని పరీక్షించారు.

నిందితులిద్దరూ పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులతో టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అరెస్టుకు కొన్ని గంటల ముందు భారత్‌లో పలు ప్రాంతాలకు చెందిన వీడియోలను పాక్‌లో కొందరికి పంపినట్లు తేలింది. అరెస్టైన ఇద్దరూ పాక్ గూఢచారులా కాదా అనే విషయం తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications