కాశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు అంతం
కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా లో గురువారం వేకువ జామున నుంచి ఎన్ కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు అంతం అయ్యారని స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు. ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కుప్వారాలో ని లాలాబ్ ప్రాంతంలో కొంత మంది ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం అందడంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. లాలాబ్ పరిసర ప్రాంతంల్లో గాలించారు. పలు ఇండ్లలో సోదాలు చేశారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఒక్క సారిగా ఉగద్రవాదులు భద్రతా దళాల మీద కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు. కొన్ని గంటల పాటు ఆ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరల్లింది. చివరికి ఇద్దరు ఉగ్రవాదులు అంతం అయ్యారని పోలీసు అధికారులు చెప్పారు.
భద్రతా దళాల చేతిలో అంతం అయిన వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు అని తెలియడం లేదని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా భారత్- పాక్ సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఉగ్రవాదులు చొరబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications