వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వావ్.. మూడింట రెండువంతుల మందికి వ్యాక్సిన్.. ఒక డోసు అయినా: వీకే పాల్

|
Google Oneindia TeluguNews

కరోనా వ్యాక్సిన్ ప్రకియ వేగం పుంజుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజున దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగిన సంగతి తెలిసిందే. దేశంలోని మొత్తం వయోజనుల జనాభాల్లో మూడింట రెండొంతుల మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందిందని నీతి ఆయోగ్ సభ్యుడు, దేశంలో కరోనా టాస్క్‌ఫోర్స్ అధినేత వీకే పాల్ వెల్లడించారు.

గురువారం నాడు కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చే సమయంలో ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. దేశంలో 18 ఏళ్ల వయసు పైబడిన వారిలో 66 శాతం మందికి కనీసం ఒక డోసు కరోనా వ్యాక్సిన్ అందిందని పాల్ తెలిపారు. మొత్తం వయోజనుల్లో దాదాపు 25 శాతం మంది రెండు డోసులూ తీసుకున్నారని, వారికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లేనని పేర్కొన్నారు. అలాగే దివ్యాంగులకు, మానసిక సమస్యలు ఉన్నవారికి ఇంటి వద్దే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఒక అడ్వైజరీని జారీ చేసినట్లు చెప్పారు. ఈ విషయం ప్రకటించడం చాలా సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు.

 two thirds of indian adult population vaccinated

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ ధరించి.. శాని టైజర్ రాసుకొని కాలం వెళ్లదీయాల్సిందేనని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. వేసవిలోనే కేసుల ప్రభావం ఎక్కువగా ఉంది.

English summary
two thirds of indian adult population vaccinated with at least one dose of vaccine corona taskforce chief vk paul said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X