రెండు రైళ్లు ఢీ: డ్రైవర్ మృతి, 100మందికి గాయాలు
పల్వాల్: హర్యానా రాష్ట్రంలోని పల్వల్ సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్-ఈఎంయూ రైళ్లు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ మంగళవారం ఉదయం 8.25గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఈఎంయూ డ్రైవర్ మృతి చెందగా, 100మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై రావడంతో ఈ ప్రమాదం సంభవించింది.
నార్తెర్న్ రైల్వేస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(సిపిఆర్ఓ) నీరజ్ శర్మ మాట్లాడుతూ.. రైలు డ్రైవర్ నిర్లక్ష్యం, పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
వైద్య, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications